ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలి

ABN , First Publish Date - 2020-11-28T06:05:04+05:30 IST

పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలని నిర్మల్‌ ఇన్‌చార్జీ ఎస్పీ విష్ణు వారియర్‌ అన్నారు. సోన్‌ పోలీస్‌ స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేశారు.

ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలి
సోన్‌ పీఎస్‌లో మొక్కలను నాటుతున్న ఎస్పీ విష్ణు వారియర్‌

నిర్మల్‌ ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు వారియర్‌

సోన్‌, నవంబరు 27: పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలని నిర్మల్‌ ఇన్‌చార్జీ ఎస్పీ విష్ణు వారియర్‌ అన్నారు. సోన్‌ పోలీస్‌ స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవందనం స్వీకరించారు. అనంత రం పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న కేసుల వివరాలను ఎస్సై ఆసీ్‌ఫను అడిగి తెలుసుకున్నారు. కేసులను సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. రోడ్డు ప్ర మాదాల నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. వాహనాల తనిఖీలు నిరంతరం చేయాలన్నారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సత్వరమే సమాచారం పోలీస్‌ స్టేషన్‌కు చేరేలా సమాచార వ్యవస్థను ఏర్పర్చుకోవాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించాలని, వారి సమస్యలను ఓపికగా తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచించాలని పే ర్కొన్నారు. పోలీస్‌ స్టేషన్‌ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్‌ స్టేషన్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. పోలీస్‌ సిబ్బంది యోగా, వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ప్రజల కష్టాలలో భాగస్వాములవుతూ వారి మన్ననలను పొందాలని అన్నారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, సోన్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ జీవన్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసులు ప్రజలతో మమేకం కావాలి

దిలావర్‌పూర్‌: పోలీసులు ప్రజలతో మమేకం కావాలని నిర్మల్‌ ఇన్‌చార్జి  ఎస్పీ విష్ణు వారియర్‌ అన్నారు. దిలావర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగితేనే ప్రజల నుంచి అవసరమైన సహకారం లభిస్తుందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ సత్ఫలితాలనిస్తోందన్నారు. బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి స్వేచ్ఛగా తన సమస్య ను చెప్పుకునే అవకాశం ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజల్లో విరివిగా అవగాహన  కల్పించాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఎస్సైను అడిగి తెలుసుకున్నారు. కేసులను సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. వాహనాల తనిఖీలు నిరంతరం చేపట్టాలన్నారు. గ్రామాల్లో అపరిచిత, అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సత్వరమే పోలీ స్‌ స్టేషన్‌కు సమాచారం చేరేలా వ్యవస్థను పటిష్టపరుచుకోవాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించాలని, వారి సమస్యలను ఓపికగా తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచించాలని పేర్కొన్నారు. పోలీస్‌ స్టేషన్‌ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్‌ స్టేషన్‌లో ఆహ్లదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది యోగా, వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజల కష్టాలలో పోలీసులు భాగస్వాములవుతూ వారి మన్ననలను పొందాలని సూచించారు. సామాజిక కార్యక్రమాలను చేపడు తూ యువతను భాగస్వాములను చేస్తూ ముందుకు సాగాలన్నారు. శాఖ పరమైన లేదా ఇతరత్రా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజల కు అందుబాటులో ఉండాలన్నారు. మండలంలో క్రైంరేట్‌ తగ్గించేందుకు కృషి చే యాలన్నారు. అంతకు ముందు ఎస్పీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, నిర్మల్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటేష్‌, ఎస్సై సంజీవ్‌ కుమార్‌, పోలీసుల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T06:05:04+05:30 IST