అన్ని పోలీ్‌సస్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌

ABN , First Publish Date - 2021-07-24T06:36:36+05:30 IST

రాష్ట్రంలో అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తున్నామని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

అన్ని పోలీ్‌సస్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌
రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న హోం మంత్రి మహమూద్‌ అలీ, చిత్రంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, సీపీ అంజనీకుమార్‌ తదితరులు

హోం మంత్రి మహమూద్‌ అలీ

అంబర్‌పేట, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తున్నామని హోం  మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. అంబర్‌పేట స్పెషల్‌ ఆర్మ్‌ రిజర్వ్‌ (సీఏఆర్‌) సెంట్రల్‌ పోలీసు లైన్‌(సీపీఎల్‌)లో నగర పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, ట్రాన్స్‌పోర్ట్‌ పార్కింగ్‌ షెడ్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. కరోనా సమయంలో పోలీసులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు రూ. 700 కోట్లు కేటాయించామన్నారు. నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసు దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందన్నారు. సీసీ కెమెరాల కోసం మినిస్టర్‌ ఫండ్‌ నుంచి రూ. 2 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సీపీఎల్‌ గ్రౌండ్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, సీపీ అంజనీకుమార్‌, జాయింట్‌ కమిషనర్‌ ఎం. రమేష్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-24T06:36:36+05:30 IST