Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాత్రి 10 గంటలకు ఈ బీటెక్ విద్యార్థిని నుంచి వచ్చిందో మెసేజ్.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ యువతి ఇంటికెళ్తే..

అతను ఓ సాధారణ మెకానిక్.. అతనికి ఇద్దరు కూతుళ్లు.. ఒకరిని ఫ్యాషన్ డిజైనర్ చేయాలనుకున్నాడు.. మరొకరిని శాస్త్రవేత్తగా చూడాలనుకున్నాడు.. అయితే ఒక మహిళ చేసిన మోసం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది.. రోజూ చస్తూ బతకడం కంటే ఒకేసారి అందరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు.. విషం తాగేశారు.. బీటెక్ చదువుతున్న చిన్న కూతురు తన సూసైడ్ నోట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. దానిని చదివిన స్నేహితులు, దగ్గర్లో ఉన్న బంధువులు వెంటనే వారి ఇంటికి చేరుకున్నారు.. ముగ్గురిని కాపాడగలిగారు.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 


భోపాల్‌లో నివసిస్తున్న సంజీవ్‌, అర్చన దంపతులకు పుర్వీ, గ్రీష్మ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంజీవ్ తల్లి నందిని కూడా వారితోనే ఉంటోంది. వారంతా శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. చనిపోయే ముందు బీటెక్ చదువుతున్న గ్రీష్మ సోషల్ మీడియాలో సూసైడ్ నోట్ పోస్ట్ చేసింది. `అంతా అయిపోయింది. నేను సైంటిస్ట్ కావాలనుకున్నాను. నా కలలు, ఆశలు ఏవీ నెరవేరవు. బబ్లీ ఆంటీ.. ఎందుకు ఇదంతా చేశావు. మేం ఏం పాపం చేశాం. మాకు ఇంత ద్రోహం ఎందుకు చేశావు. మా ఉసురు నీ కుటుంబానికి తగులుతుంది. ఇంకే కుటుంబాన్నీ ఇలా మోసం చెయ్యకు. ఎవరైనా ఈ మెసేజ్ చదివితే బబ్లీ ఆంటీకి కచ్చితంగా చేరవెయ్యండి. మమ్మల్ని ఏడిపించిన అందరికీ గుడ్ బై` అని గ్రీష్మ ఆ మెసేజ్‌లో పేర్కొంది. 


ఆ మెసేజ్ చదివిన గ్రీష్మ స్నేహితులు, దగ్గర్లో ఉన్న బంధువు వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నారు. తలుపు వేసి ఉండడంతో బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే కుటుంబ సభ్యులందరూ స్పృహ కోల్పోయారు. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గ్రీష్మ, ఆమె నాన్నమ్మ నందిని ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు చికిత్స అందుకుంటున్నారు. డబ్బులు విషయంలో బబ్లీ అనే మహిళ సంజీవ్ కుటుంబాన్ని మోసం చేసిందని, అందుకే వారు ఆత్మహత్యలకు ప్రయత్నించారని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement