కప్ప బొమ్మ!

ABN , First Publish Date - 2021-07-19T05:30:00+05:30 IST

ఎగ్‌ కాటన్‌లో నుంచి రెండు ఎగ్‌ కప్పులు కట్‌ చేయాలి.

కప్ప బొమ్మ!

కావలసినవి

కోడిగుడ్లు పెట్టే ఎగ్‌ ట్రే(కాటన్‌), ఫోమ్‌ కాఫీ కప్పు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు కాగితం, గ్రీన్‌ పైప్‌ క్లీనర్స్‌ రెండు, గ్రీన్‌ బటన్స్‌ రెండు, గూగ్లీ కళ్లు, కత్తెర, జిగురు.

తయారీ ఇలా...

ఎగ్‌ కాటన్‌లో నుంచి రెండు ఎగ్‌ కప్పులు కట్‌ చేయాలి. వాటికి, కాఫీ కప్పుకు ఆకుపచ్చ రంగు వేయాలి. కాఫీ కప్పు బాటమ్‌ నుంచి రెండు అంగుళాల పైకి కట్‌ చేయాలి. 

ఒక పైప్‌ క్లీనర్‌ను తీసుకుని సగానికి కట్‌ చేయాలి. వాటిని బొమ్మలో చూపించిన విధంగా హార్ట్‌ షేపులో మలిచి కప్పుకు అతికిస్తే వెనక కాళ్లు రెడీ.

ఇప్పుడు ముందు కాళ్ల కోసం రెండవ పైప్‌ క్లీనర్‌ను తీసుకుని సగానికి కట్‌ చేయాలి. వాటిని బొమ్మలో చూపించిన విధంగా మలిచి ముందు భాగంలో అంటించాలి.

ఎరుపు రంగు కాగితంను నాలుకలా కట్‌ చేసి ఒక ఎగ్‌కప్పు లోపలి భాగంలో అంటించాలి. తరువాత ఆ కప్పుపై మరో కప్పు అంటించాలి. ఈ రెండు కప్పులను కాఫీ కప్పుకు అతికించాలి. 

గ్రీన్‌ బటన్స్‌పైన గూగ్లీ కళ్లను అతికించాలి. తరువాత బటన్స్‌ను పై ఎగ్‌ కప్పుకు అతికించాలి. అంతే... కప్ప బొమ్మ రెడీ.

Updated Date - 2021-07-19T05:30:00+05:30 IST