ముగ్గురు అమ్మాయిల అద్భత ప్రతిభ.. గురుకులం టూ అమెరికా!

ABN , First Publish Date - 2021-08-01T10:31:38+05:30 IST

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో చదువుకున్న ఆ ముగ్గురు అమ్మాయిలకు అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించాలనే కల సాకారం కానుంది. అమెరికన్‌ కాన్సులేట్‌ నిర్వహించిన ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ దేశంలోని కమ్యూనిటీ కాలేజీలకు ఎంపికయ్యారు! ఈ ఘనత సాధించిన విద్యార్థినులు రంగారెడ్డి జిల్లాకు చెందిన శిరీష...

ముగ్గురు అమ్మాయిల అద్భత ప్రతిభ.. గురుకులం టూ అమెరికా!

యూఎస్‌ కాన్సులేట్‌ పరీక్షలో ముగ్గురు డిగ్రీ విద్యార్థినులు పాస్‌

ఆ దేశంలోని కమ్యూనిటీ కాలేజీల్లో ఉన్నత చదువులకు అర్హత

ముగ్గురూ నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలే 

ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ప్రోత్సాహం: రోనాల్డ్‌ రోస్‌


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో చదువుకున్న ఆ ముగ్గురు అమ్మాయిలకు అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించాలనే కల సాకారం కానుంది. అమెరికన్‌ కాన్సులేట్‌ నిర్వహించిన ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ దేశంలోని కమ్యూనిటీ కాలేజీలకు ఎంపికయ్యారు! ఈ ఘనత సాధించిన విద్యార్థినులు రంగారెడ్డి జిల్లాకు చెందిన శిరీష, హైదరాబాద్‌కు చెదిన బ్లోసమ్‌, వనపర్తి జిల్లాకు చెందిన ప్రీతి. పేద కుటుంబాలకు చెందిన వీరు యూఎ్‌సఏ ప్రతిష్ఠాత్మక కమ్యూనిటీ కాలేజ్‌ ఇనిషియేట్‌ ప్రోగ్రామ్‌ (సీసీఐపీ), ఫెలోషి్‌పతో కమ్యూనిటీ కాలేజీల్లో చదివేందుకు త్వరలోనే అమెరికా విమానం ఎక్కనున్నారు. పట్టుదలతో చదివి ఆంగ్ల భాషపై పట్టుసాధించి అర్హత సాధించారు.


రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామానికి చెందిన శిరీష తల్లిదండ్రులు దినసరి కూలీలు. వనపర్తి జిల్లా ములమల్ల గ్రామానికి చెందిన ప్రీతి తండ్రి రైతు. అమెరికా ఓహియోలోని సింక్లెయిర్‌ కమ్యూనిటీ కాలేజీలో అగ్రికల్చర్‌ కోర్సుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌కు చెందిన బ్లోసమ్‌ తల్లిదండ్రులది ప్రైవేటు ఉద్యోగం. ఎల్‌బీ నగర్‌లోని గురుకుల డిగ్రీ కళాశాలలో చదివిన బ్లోసమ్‌ బాలిమోర్‌ కమ్యూనిటీ కాలేజీకి ఎంపికయ్యారు. కాగా, ఉన్నత చదువులు చదివే విద్యార్ధులకు ప్రోత్సాహం అందిస్తామని గురుకుల సంస్థ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. అద్భుత విజయాన్ని సాధించిన విద్యార్ధులను ఆయన అభినందించి ల్యాప్‌టా్‌పలు అందజేశారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పర్యవేక్షణలో విద్యార్ధుల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరేళ్లలో 20 మంది అమెరికన్‌ కమ్యూనిటీ కళాశాలలకు ఎంపియ్యారని చెప్పారు.


గురుకుల పాఠశాలలో ప్రవేశం నా జీవితాన్ని మార్చేసింది 

ఒకటో తరగతి నుంచి 4వ తరగతి దాకా జడ్చర్లలో చదువుకున్నా. 5వ తరగతి నుంచి డిగ్రీ దాకా గురుకులంలోనే చదివా. గురుకుల పాఠశాలలో చేరడం నా జీవితాన్నే మార్చేసింది. మొదట్లో ఇంగ్లిష్‌ మాట్లాడటం, చదవటం కష్టంగా ఉండేది. ఇంగ్లిష్‌ నేర్చుకునేందుకు ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడిపేదాన్ని. ఇంగ్లిష్‌ ఈ-ప్లస్‌ క్లబ్‌ 5 నిమిషాలు అనర్గళంగా ఇంగ్లి్‌షలో మాట్లాడించేవారు. భాషపై పట్టు సాధించేందుకు వెయ్యికిపైగా ఇంగ్లిష్‌ స్టోరీస్‌ చదివా. ఎప్పటికప్పుడు ఇంగ్లి్‌షలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేదాన్ని.  భవిష్యత్తులో ఐఏఎస్‌ కావాలనేది నా లక్ష్యం. ఒకవేళ అది నెరవేరకపోతే ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌నవుతా. మా కుటుంబం ఆర్థిక పరిస్థితిని కారణంగా నేనూ విమానమెక్కి అమెరికా వెళ్తానని ఎన్నడూ ఊహించలేదు. త్వరలోనే నేను ఎంపికైన జేమ్‌ స్టౌన్‌ కమ్యూనిటీ కాలేజీ బాల్య విద్య కోర్సుకు కోసం న్యూయార్క్‌ వెళతాను. 

-శిరీష, రంగారెడ్డి జిల్లా


Updated Date - 2021-08-01T10:31:38+05:30 IST