అందరికీ గుడ్ న్యూస్.. నేటి నుంచి అన్ని బ్యాంకుల బ్రాంచిలు పనిచేస్తాయ్!

ABN , First Publish Date - 2020-03-30T18:31:34+05:30 IST

బ్యాంకు ఖాతాదారులందరికీ ప్రభుత్వం నుంచి ఒక తీపి కబురు అందింది. అదేంటంటే నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల అన్ని బ్రాంచ్‌లు అందుబాటులోజజజ

అందరికీ గుడ్ న్యూస్.. నేటి నుంచి అన్ని బ్యాంకుల బ్రాంచిలు పనిచేస్తాయ్!

కోల్‌కత: బ్యాంకు ఖాతాదారులందరికీ ప్రభుత్వం నుంచి ఒక తీపి కబురు అందింది. అదేంటంటే నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సంబంధించిన అన్ని బ్రాంచిలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు ఖాతాల ద్వారానే ప్రజలకు జీతాలు, పెన్షన్‌లు అందుతాయని, అందువల్ల ప్రతి బ్యాంకు తమ బ్రాంచిలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయా యాజమన్యాలకు ప్రభుత్వం సూచించింది.


బ్రాంచిలను తెరిచి ఉంచడమే కాకుండా లాక్‌డౌన్ కొనసాగినంత కాలం ఆయా బ్రాంచిల్లో కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం బ్యంకులను ఆదేశించింది. దీనివల్ల ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారనేది ప్రభుత్వ ఆలోచన.  ముఖ్యంగా కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన 1.7 లక్షల కోట్ల నిధులను గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అందించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్ ఉన్నంత కాలం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నట్లు ప్రభుత్వ తన ఉత్తర్వుల ద్వారా తెలిపింది.


ఇదిలా ఉంటే ప్రతి బ్యాంచిలోనూ అవసరమైనంత మేరకు మాత్రమే సిబ్బంది పని చేయనున్నారు. నగదు జమ, విత్‌డ్రా, చెక్ క్లియరెన్స్, ప్రభుత్వ లావాదేవీలు, ఏటీఎం సర్వీసులు వంటి అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. 

Updated Date - 2020-03-30T18:31:34+05:30 IST