Sep 21 2021 @ 01:02AM

నవంబర్‌ నుంచి ఏకధాటిగా...

ప్రభాస్‌, దీపికా పడుకోన్‌ జంటగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ప్రాజెక్ట్‌ కె’ పేరుతో వ్యవహరిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్‌లో ప్రారంభం కానుందనీ, అప్పుడే ప్రభాస్‌, దీపిక కూడా సెట్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ఆలోగా ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఏకధాటిగా ఏడాది షూటింగ్‌ జరిపి 2022 ఆఖరుకల్లా సినిమా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ భావిస్తోందట. చిత్రీకరణ పూర్తిగా హైదరాబాద్‌లోనే జరుగనుంది. ప్రస్తుతం భారీసెట్లు నిర్మిస్తున్నారు. జులైలో ‘ప్రాజెక్ట్‌ కె’ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న అమితాబ్‌ బచ్చన్‌పై వారం రోజుల పాటు కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు.