వేగం పెంచిన భూమి.. ఇక నిముషానికి 59 సెకండ్లే..!

ABN , First Publish Date - 2021-01-08T15:40:53+05:30 IST

భూమి వేగం పెంచుకుంటోంది. తన చుట్టూ తాను వేగంగా తిరుగుతోంది. దీనివల్ల టైం వేగంగా గడిచిపోతోంది. రోజు తగ్గిపోతోంది. దీంతో భూమికి ప్రళయ సంకేతాలు కనపడుతున్నాయని ..

వేగం పెంచిన భూమి.. ఇక నిముషానికి 59 సెకండ్లే..!

ఇంటర్నెట్ డెస్క్: భూమి వేగం పెంచుకుంటోంది. తన చుట్టూ తాను వేగంగా తిరుగుతోంది. దీనివల్ల టైం వేగంగా గడిచిపోతోంది. రోజు తగ్గిపోతోంది. దీంతో భూమికి ప్రళయ సంకేతాలు కనపడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎప్పుడో మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి తన చుట్టూ తాను వేగంగా భ్రమించేదట. దీనివల్ల ఒకసారి సూర్యుడిని చుట్టి వచ్చే లోపు భూమి తన చుట్టూ తాను ఏకంగా 419 నుంచి 420 సార్లు తిరిగేదట. అయితే అది కాల క్రమంలో తగ్గింది. ప్రస్తుతం 365 సార్లు మాత్రమే పరిభ్రమిస్తోంది. అయితే ప్రతి ఏడాది దాదాపు 6 గంటల సమయం ఎక్కువగా ఉంటోంది.  దీంతో నాలుగో ఏడాదిని లీపు ఇయర్‌గా గుర్తించి ఆ ఏడాదికి 366 రోజులుగా నిర్ణయించారు శాస్త్రవేత్తలు. కానీ ఇప్పుడు ఆ లెక్క కూడా మారేలా ఉంది. 


భూమి వేగం పెరుగుదలలో మార్పులకు అనేక కారణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోని సముద్ర మట్టం స్థాయిలో మార్పులు దీనికి కారణం కావచ్చని, చంద్రుడు భూమికి దూరంగా కదులుతుండడం కూడా ఒక కారణమయ్యే అవకాశం ఉందని వారంటున్నారు. గత కొన్నేళ్ల నుంచి భూమి చాలా వేగంగా పరిభ్రమిస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. సాధారణంగా భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగే సరికి 23 గంటల 56 నిముషాల 4 సెకండ్ల సమయం పడుతుంది. గంటకు 60 నిముషాలు.. నిముషానికి 60 సెంకండ్లు. అయితే ఇకపై ఈ లెక్క మారనుంది. అంటే.. నిమిషానికి 60 సెకన్లు కాదు, 59 సెకన్లుగా మారనుంది. ఇలా నిముషం నుంచి ఓ సెకనును తీసేయాలనే ఆలోచనలో శాస్త్రవేత్తలు ఉన్నారు.


సగటు రోజు సాధారణ 86,400 సెకన్లు ఉంటుంది. అయితే 2021లో 0.05 మిల్లీసెకన్లు తక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘అయితే దీనిని అడ్జస్ట్ చేయాలంటే సాధారణ విషయం కాదు. ఇలా ఇంతకుముందు కూడా టైం అడ్జస్ట్ జరిగింది. కానీ అప్పుడు కేవలం 1 మిల్లీ సెకను అడ్జస్ట్ చేశారు. దానివల్లే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వచ్చింది. కంప్యూటర్లు, శాటిలైట్లు అన్నీ క్రాష్ అయిపోయాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఓ సెకండ్ అడ్జస్ట్ చేయడమంటే కోరి ప్రళయాన్ని తెచ్చుకున్నట్లేన’ని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చివరికి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం కనుక్కుంటారో వేచి చూడాలి.



Updated Date - 2021-01-08T15:40:53+05:30 IST