సముద్ర బాధితుల కోసం డ్రోన్లు

ABN , First Publish Date - 2022-02-13T14:40:27+05:30 IST

సముద్రం మధ్యలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు డ్రోన్లను వినియోగించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. తద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని భావిస్తోంది. అధికారులు ఈ డ్రోన్లను శనివారం బిసెంట్‌నగర్‌

సముద్ర బాధితుల కోసం డ్రోన్లు

- ‘ఆకాశ కన్ను’తో గాలింపు

- బిసెంట్‌ నగర్‌లో ప్రయోగం


పెరంబూర్‌(చెన్నై): సముద్రం మధ్యలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు డ్రోన్లను వినియోగించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. తద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని భావిస్తోంది. అధికారులు ఈ డ్రోన్లను శనివారం బిసెంట్‌నగర్‌ సముద్రతీరంలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో నిఘా చేపట్టి అవాంఛనీయ సంఘటనలు అడ్డుకోవడం, సముద్రతీరాల్లో భద్రత కోసం రూ.3.6 కోట్లతో మూడు రకాల డ్రోన్లను పోలీసు శాఖ కొనుగోలు చేసింది. ‘క్విక్‌ రెస్పాన్స్‌’ పేరిట సత్వర సహాయం కోసం హెచ్‌డీ కెమెరాలు, రాత్రి వేళల్లో కూడా దృశ్యాలు నమోదుచేసే అధునాతన కెమెరాలను ఈ డ్రోన్లలో పొందుపరిచారు. ప్రజలను హెచ్చరించేందుకు స్పీకర్లు ఏర్పాటుచేసి 2కి.మీ దూరానికి 30 నిమిషాల్లో వెళ్లేలా 6 డ్రోన్లు కొనుగోలు చేసింది. మరో రెండు డ్రోన్లు అధిక బరువు మోయగలిగిన సామర్థ్యం కలిగి వున్నాయి. ముఖ్యంగా, మెరీనా, బిసెంట్‌ నగర్‌ బీచ్‌లలో స్నానం చేస్తూ అలల తాకిడికి గల్లంతవుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. అలాంటి వారిని రక్షించడం, అవసరమైన వారికి లైఫ్‌ జాకెట్లు అందించే విధంగా రూపొందించిన ఈ డ్రోన్లను బిసెంట్‌నగర్‌ సముద్రతీరంలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ డ్రోన్‌ల పర్యవేక్షణ త్వరలో అందుబాటులోకి వస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-02-13T14:40:27+05:30 IST