ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ సేవలు అద్భుతం

ABN , First Publish Date - 2021-01-17T06:01:09+05:30 IST

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ సేవలు అద్భుతం

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ సేవలు అద్భుతం

కంకిపాడు, జనవరి 16 : కరోనా వైరస్‌తో ముందుండి పోరాడిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ సేవలు అద్భుతమని ఎమ్మెల్యే కె. పార్థసారథి అన్నారు. ఉప్పలూరు పీహెచ్‌సీలో శనివారం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.   పెనమలూరు ఏఎంసీ చైర్మన్‌ మద్దాలి రామచంద్రరావు,  సత్యనారాయణ, వైద్యాధికారి శ్యాంసుందర్‌, బందెల సుబ్బారావు, నాంచారయ్య, వసంతరావు, కుటుంబరావు, బాకిబాబు  పాల్గొన్నారు. 

ఫ విజయవాడ సిటీ: ప్రపంచంలోనే అత్యంత బృహ త్తరమైన వ్యాక్సినేషన్‌ శనివారం ప్రధాన మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైందని, తొలివిడతలో ఫ్రంట్‌ లైన్‌ వారి యర్స్‌ అందరూ ముందుకు వచ్చి టీకాను తీసుకోవాలని  ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఏపీ స్టేట్‌ శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. రెండవ మోతాదు టీకా తీసుకున్న 10 రోజుల తర్వాత నుంచి పూర్తిస్థాయిలో రక్షణ  పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఫ హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ విజయ వంతమైందని ఎంపీడీవో కేశవరెడ్డి తెలిపారు. వీరవల్లి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో  37 మందికి   వ్యాక్సిన్‌ వేసి నట్టు ఎంపీహెచ్‌వో స్వామి తెలిపారు.

జి.కొండూరు: వెలగలేరు పీహెచ్‌సీ పరిధిలో తొలి రోజు 75 మందికి కోవ్యాక్సిన్‌ టీకాలు వేసినట్లు వైద్యులు కిషోర్‌కుమార్‌, మాధురిదేవి తెలిపారు.  

Updated Date - 2021-01-17T06:01:09+05:30 IST