Abn logo
Sep 22 2021 @ 14:46PM

వేగన్ ఉత్పత్తులను గుర్తించడానికి కొత్త లోగో

ముంబై: ది ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా( ఏఫ్ఎస్ఎస్ఐ ) వేగన్ ఉత్పత్తులను గుర్తించడానికి కొత్త లోగోను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఈ కొ్త్త లోగో ఆకుపచ్చ రంగులో ఉండి, మధ్యలో ‘V’ అనే ఆంగ్ల అక్షరం ఉంటుంది. ‘V’ ఆకారం మధ్యలో ఒక చిన్న మొక్క ఉంటుంది. శాకాహార, మాంసాహార ఉత్పత్తులను గుర్తించడానికి ఇప్పటికే ఏఫ్ఎస్ఎస్ఐ ఆకుపచ్చ, ఎరుపు రంగులు ఉన్న లోగోలను తీసుకువచ్చింది. ప్రస్తుతం ఏఫ్ఎస్ఎస్ఐ ప్రతిపాదిస్తున్న కొత్త లోగో వేగన్ ఉత్పత్తులను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. పాలతో సహా గుడ్లు, చేపలు, మాంసం, తేనే, తేనే సంబంధిత ఆనవాళ్లు లేని ఉత్పత్తులను వేగన్ పదార్థాలు అంటారు.