నిగ్గు మొన

ABN , First Publish Date - 2020-02-17T11:22:57+05:30 IST

జీవి పరిధిని కొలత వేస్తూ కొమ్మలను కమ్ముతూ మెల్లని లయలా సాగుతున్న పొగమంచు నిలబడి పోయాం మనం...

నిగ్గు మొన

జీవి పరిధిని

కొలత వేస్తూ

కొమ్మలను కమ్ముతూ

మెల్లని లయలా 

సాగుతున్న పొగమంచు

నిలబడి పోయాం మనం...

అసీమమైన

ఆ ధావళ్యం

ఎట్టెదుట!

లోయలూ కొండలను

పల్లపు దారులను

కాలినడకల జాడలను

ఋతువు కదలికలను

అలుముకున్న

సడిలేని ఆ దుగ్ధలో...

రెల్లు ఈకలా

సన్నని జల్లు

చెంపలు నిమిరి

కలుకొలకుల సాగి

చుక్కలా చెమరింది


గుండె మొరాయించింది

చర్మం అణువణువులో కెరలింత

సూది పోటులా చొరబడే

నిగ్గు మొనల

అకారణ కారుణ్యం కోసం....

సుమనస్పతి

- 96761 80802


Updated Date - 2020-02-17T11:22:57+05:30 IST