Abn logo
Jul 31 2021 @ 01:05AM

హైదరాబాద్‌లో ఫుజిఫిలిమ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డయాగ్నోస్టిక్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీలను అందిస్తున్న ఫుజిఫిలిమ్‌ హైదరాబాద్‌లో యశోదా హాస్పిటల్‌తో కలిసి ఎక్సలెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పల్మనాలజీ, ఎండోస్కోపీ తదితర విభాగాల్లో ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. ఇటువంటి కేంద్రం వల్ల ఇతర డాక్టర్లతో నైపుణ్యాలను పెంచుకోవడానికి అవకాశం లభిస్తుందని యశోదా హాస్పిటల్‌ పల్మనరీ విభాగం అధిపతి హరికిషన్‌ తెలిపారు.