సీఎం హామీని నెరవేర్చండి

ABN , First Publish Date - 2021-11-29T05:04:07+05:30 IST

ఎలక్షన్‌ ప్రచారంలో సీఎం కేసీఆర్‌ మినీ బస్‌ డిపో ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీని నెరవేర్చాలని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కోరారు.

సీఎం హామీని నెరవేర్చండి
ఆర్డీసీ ఎండీకి పుష్పగుచ్ఛాన్ని ఇస్తున్న అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

- ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కోరిన  ఎమ్మెల్యే అబ్రహాం

 గద్వాల, ఆంధ్రజ్యోతి, నవంబరు 28: ఎలక్షన్‌ ప్రచారంలో సీఎం కేసీఆర్‌ మినీ బస్‌ డిపో ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీని నెరవేర్చాలని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కోరారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం అలంపూర్‌ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎండీని ఎమ్మెల్యే అలంపూర్‌ హరిత హోటల్‌లో కలిశారు. బార్డర్‌ ఏరియాలో ఉన్న అలంపూర్‌ నియోజక వర్గానికి మినీ బస్‌ డిపో అవసరమని తెలిపారు. అయిదవ శక్తి పీఠం అయిన జోగుళాంబ ఆలయానికి దేశ నలుమూలల నుంచి పర్యటకులు వస్తుంటారని, కర్ణాటక, ఏపీ రాష్ట్రలకు ప్రధాన కూడలిగా ఉన్నందున ఇక్కడ ఒక డిపోను ఏర్పాటు చేయాలని  నివేదించారు. ఇందుకు సజ్జనార్‌ సానుకులంగా స్పందిస్తూ వెంటానే పరిశీలించి తప్పకుండా బస్‌డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. 

Updated Date - 2021-11-29T05:04:07+05:30 IST