Advertisement
Advertisement
Abn logo
Advertisement

దివ్యాంగుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం

 కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. శుక్రవారం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక వేడుకల్లో ఆయన మాట్లాడారు.   దివ్యాంగులు అర్థికంగా ఎదగడానికి  జీవనోపాధి అవకాశాలు కల్పిస్తామని,  జిల్లా యంత్రాంగం నిత్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. దివ్యాంగులు ధృడ సంకల్పంతో విద్యను అభ్యసించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నించాలని ఆకాంక్షించారు.     పట్టుదలతో ఇతరులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.  ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ దివ్యాంగుల సౌకర్యార్థం జిల్లాలోని ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యేకంగా ర్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగులు పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వస్తే వారి ఫిర్యాదులు స్వీకరించి తదుపరి చర్యలు వెంటనే తీసుకునేలా అదేశాలు జారీ చేశామన్నారు.  దివ్యాంగులను కించపర్చే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.   కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, అడిషనల్‌ డీఆర్డీవో మదన్‌మోహన్‌, రవికుమార్‌, పాపారావు తదితరులు పాల్గొన్నారు

Advertisement
Advertisement