ఏఓపై పూర్తిస్థాయి విచారణ : జేడీఏ

ABN , First Publish Date - 2021-05-08T06:24:17+05:30 IST

మండలఏఓ రాజ్యలక్ష్మి అ వినీతి ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులకు నివేదికలు పంపుతామని జేడీఏ రామక్రిష్ణ పే ర్కొన్నారు.

ఏఓపై పూర్తిస్థాయి విచారణ : జేడీఏ
విచారిస్తున్న జేడీఏ రామక్రిష్ణ

విడపనకల్లు, మే7: మండలఏఓ రాజ్యలక్ష్మి అ వినీతి ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులకు నివేదికలు పంపుతామని జేడీఏ రామక్రిష్ణ పే ర్కొన్నారు. స్థానిక వ్యవసా య కార్యాలయంలో జేడీఏ  ఆధ్వర్యంలో సస్పెండ్‌ అ యిన ఏఓ రాజ్యలక్ష్మిపై శుక్రవారం విచారణ చేశారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ హావళిగి గ్రామానికి చెందిన డీలర్‌ వీరభద్రా రెడ్డి నుంచి రూ.5 వేలు లంచం అడిగిన విషయం పత్రికలు, సామాజిక మాధ్యమాలలో వచ్చిందన్నారు. ఈ విషయ మై పూర్తి స్థాయిలో విచారించగా, వీరభద్రారెడ్డి షాపు రెన్యువల్‌ కోసం రూ.20వేలు ఇచ్చానని, అవి సరిపోక మరలా రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయటంతో ఫోన సంభాషణను రికార్డు చేసినట్లు తెలిపాడన్నారు. ఏఓ కూడా ఆ వాయిస్‌ తనదేనని, అది నేను ఎప్పుడో మాట్లాడిన ఆడియోను అలా చేసారని తెలిపిందన్నారు. ఆమె చె ప్పిన మేరకు జేడీఏ వరకూ ఇచ్చుకుంటూ పోవాలన్న విషయం అవాస్తవమన్నారు. జిల్లాలోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు దుకాణదారులు నేరుగా ఆనలైనలోనే దరఖాస్తు చేసుకుంటే వారికి నేరుగా మంజూరు పత్రాలు పంపుతామన్నారు. ఏదైనా సరైన సమాచారం లేకపోతే అటువంటి వాటిని మాత్రం వెనక్కి పంపుతామన్నారు. ఎవరూ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు ఎవరైనా డ బ్బులు డిమాండ్‌ చేస్తే జేడీఏ కార్యాలయానికి నేరుగా ఫిర్యాదు చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేస్తామన్నారు. కాగా విచారణ జరుగుతుందని తెలిసి కూడా ఏడీఏ పద్మజ హాజరు కాకపోవటం, కనీసం ఫోనలో కూడా మాట్లాడక పోవటంతో జేడీఏ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-05-08T06:24:17+05:30 IST