ఎడతెరిపి లేని వర్షం.. పారుతున్న వాగులు, వొర్రెలు

ABN , First Publish Date - 2020-08-14T18:56:21+05:30 IST

ఎడతెరిపి లేని వర్షం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను మురిపిస్తోంది. జిల్లాలో 24 గంటలుగా కురుస్తున్న వానకు వాగులు, వొర్రెల్లో నీటి ప్రవా హం మొదలైంది.

ఎడతెరిపి లేని వర్షం.. పారుతున్న వాగులు, వొర్రెలు

మత్తడి దూకిన నక్కవాగు 

జిల్లాలో 27.1 మిల్లీమీటర్ల సగటు వర్షం 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): ఎడతెరిపి లేని వర్షం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను మురిపిస్తోంది. జిల్లాలో 24 గంటలుగా కురుస్తున్న వానకు వాగులు, వొర్రెల్లో నీటి ప్రవా హం మొదలైంది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. పాల్వంచ వాగు ప్రవాహంతో ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లోకి వరద నీరు చేరుతోంది. తంగళ్లపల్లి మండలంలోని నక్కవాగు ప్రాజెక్ట్‌ నిండి మత్తడి దూకుతుండ డంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలివెళ్లి వీక్షిస్తున్నారు. మత్స్యకారులు చేపలు పడుతున్నారు. జిల్లాలో గురువారం 27.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రుద్రంగిలో 27.7 మిల్లీ మీటర్ల వర్షం కురవగా చందుర్తిలో 18.4 మిల్లీమీటర్లు, వేములవాడ రూరల్‌లో 25.5 మిల్లీమీటర్లు, బోయినపల్లిలో 14.6 మిల్లీమీటర్లు, వేములవాడలో 32.2 మిల్లీమీటర్లు, సిరిసిల్లలో 44.0 మిల్లీమీటర్లు, కోనరావుపేటలో 36.1మిల్లీమీటర్లు, వీర్నపల్లిలో 25.8 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 28.6 మిల్లీమీటర్లు, గంభీరావుపేటలో 24.7 మిల్లీమీటర్లు, ముస్తాబాద్‌లో 21.1 మిల్లీమీటర్లు, తంగళ్లపల్లిలో 28.8 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 25.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో జిల్లాలో వానాకాలం పంటల సాగు జోరందుకుంది. నాట్లు వేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో కూలీల కోరత రైతులను ఇబ్బంది పెడుతోంది. నాట్లు వేయడానికి రూ.450 నుంచి 500 వరకు కూలీ చెల్లిస్తున్నారు. 


Updated Date - 2020-08-14T18:56:21+05:30 IST