ముసురేసింది.. నిండుకుండలుగా మారుతున్న చెరువులు

ABN , First Publish Date - 2020-08-13T16:46:59+05:30 IST

రెండు రోజులుగా కురుస్తున్న ముసురువానలు జలదృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా పడుతున్న వర్షాలతో వ్యవసాయబావుల వద్దకు వెళ్లే కాలిబాటలన్నీ బురదమయంగా మారిపోతున్నాయి.

ముసురేసింది.. నిండుకుండలుగా మారుతున్న చెరువులు

జనగామ జిల్లా వ్యాప్తంగా ముసురువాన

పత్తి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం


జనగామ (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా కురుస్తున్న ముసురువానలు జలదృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా పడుతున్న వర్షాలతో వ్యవసాయబావుల వద్దకు వెళ్లే కాలిబాటలన్నీ బురదమయంగా మారిపోతున్నాయి. చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరుపోగై నిండుకుండలను తలపిస్తున్నాయి. మెట్టపంటలను సాగు చేసిన రైతులు మాత్రం ముసురు కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా పత్తి, కంది పంటలు నీటమునిగే ప్రమాదంలో ఉన్నాయి.  వరినాట్లు వేసుకునే రైతులకు ఊరటను కల్పిస్తున్నాయి. సాధారణంగా నీటినిచ్చే బోరుబావుల కింద రైతులు ముసురు పుణ్యమాని నాట్లు వేసుకునే పనిలో కర్షకులు నిమగ్నమయ్యారు. గ్రామాల్లో వీధులన్నీ బురదమయంగా మారి చిత్తడిచిత్తడిగా దర్శనమిస్తున్నాయి. వర్షం కారణంగా ఇప్పటికే జిల్లాలోని అనేక చెరువులు మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Updated Date - 2020-08-13T16:46:59+05:30 IST