జోరుగా కురుస్తున్న వర్షాలు.. కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు

ABN , First Publish Date - 2020-08-11T20:30:20+05:30 IST

ల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలం సీజన్‌లో ఈ రకంగా వర్షం కురవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆదివారం ఉదయం వరకు 28.9 మిల్లీ మీటర్ల

జోరుగా కురుస్తున్న వర్షాలు.. కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు

జిల్లా వ్యాప్తంగా సగటు 28.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం 


పెద్దపల్లి (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలం సీజన్‌లో ఈ రకంగా వర్షం కురవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆదివారం ఉదయం వరకు 28.9 మిల్లీ మీటర్ల సగటు వర్ష పాతం నమోదయ్యింది. అత్యధికంగా మంథని ముత్తారం మండలంలో 50.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అలాగే సుల్తానాబాద్‌లో 45.7, ఓదెలలో 45.2, ఎలిగేడులో 34.4, కాల్వశ్రీరాంపూర్‌లో 34.0, మంథనిలో 32.6, పెద్దపల్లిలో 30.8, కమాన్‌పూర్‌లో 30.4, రామగిరిలో 28.0, అంతర్గాంలో 21.5, రామగుండంలో 20.6, జూలపల్లిలో 16.2, ధర్మారంలో 9.2, పాలకుర్తి మండలంలో 5.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాలకు హుస్సేన్‌మియా వాగుకు వరద పెరిగింది. మానేరు నది గుండా కూడా వరద వస్తున్నది. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వస్తున్నాయి. ఎక్కడ కూడా పంటలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదు. మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. 


నంది పంప్‌హౌస్‌ నుంచి నీటి విడుదల 

ధర్మారం: ధర్మారం మండలం నందిమేడారంలో గల నంది పంప్‌హౌస్‌ నుంచి సోమవారం అధికారులు నీటిని విడుదల చేశారు. ఐదు పంప్‌మోటర్ల ద్వారా 15,750క్యూసెక్కుల నీటిని నంది మేడారం రిజర్వాయర్‌  గుండా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్‌లో గల గాయత్రి పంప్‌హౌస్‌లోకి నీటిని తరలిస్తున్నారు. 


సరస్వతి పంపుహౌజ్‌ నుంచి..

మంథని/మంథనిరూరల్‌: మండలంలోని గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతీ పంపుహౌజ్‌లో సోమవారం 7 మోటర్లు రన్నింగ్‌ కొనసాగుతుంది. వీటి ద్వారా 20, 300 క్యూసెక్‌ల నీటి పార్వతీ బ్యారేజీలోకి ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం పంపుహౌజ్‌లో 117 ఫోర్‌బే లెవల్‌ నీరు నిల్వ ఉంది. పార్వతీ బ్యారేజీలో 6.067 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 


ఎల్లంపల్లికి చేరుతున్న అన్నారం నీటి వరద..

అంతర్గాం: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గోలివాడ(పార్వతి) పంప్‌హౌస్‌ కాళేశ్వరం అనుసంధాన అన్నారం వరద ప్రవాహాన్ని ఎత్తిపోసే ప్రక్రియ 8మోటార్లతో సోమవారం సైతం కొనసాగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ 20.175టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.7248టీఎంసీలు, ఇన్‌ఫ్లో 20,954 క్యూసెక్కులుగా ఉందని ప్రాజెక్టు ఏఈ కార్తీక్‌ తెలిపారు. 


Updated Date - 2020-08-11T20:30:20+05:30 IST