పూర్తిస్థాయిలో సాగు నీరందించకపోతే నష్టపోతాం

ABN , First Publish Date - 2021-01-21T06:32:06+05:30 IST

చిందాడగరువు, రోళ్లపాలెం గ్రామాల్లో ప్రస్తుత దాళ్వా సీజన్‌లో సుమారు 350 ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో వరినాట్లు వేసు కునే పరిస్థితి లేకపోవడాన్ని వ్యవసా యశాఖ అధికారుల బృందం గుర్తించింది.

పూర్తిస్థాయిలో సాగు నీరందించకపోతే నష్టపోతాం
రోళ్లపాలెంలో పొలాలను పరిశీలిస్తున్న సహాయ సంచాలకుడు ఎంఏ షంషీ

వ్యవసాయ శాఖాధికారులకు మొరపెట్టుకున్న  రైతులు
అమలాపురం రూరల్‌, జనవరి 20:  చిందాడగరువు, రోళ్లపాలెం గ్రామాల్లో ప్రస్తుత దాళ్వా సీజన్‌లో సుమారు 350 ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో వరినాట్లు వేసు కునే పరిస్థితి లేకపోవడాన్ని వ్యవసా యశాఖ అధికారుల బృందం గుర్తించింది. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘సాగుకు గడ్డుకాలమే’ శీర్షికన ప్రచురి తమైన వార్తా కథనానికి స్పందించి అమలాపురం వ్యవసాయశాఖ సహాయ సంచా లకుడు ఎంఏ షంషీ, మండల వ్యవసాయాధికారి కడలి ధర్మప్రసాద్‌ల బృందం ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లా డారు. ఆయా గ్రామాల్లో దుక్కిదున్ని, సాగునీరు అందని పంట పొలాలతో పాటు 35రోజు లపైన వేసిన నారుమడులను అధికారులు పరిశీలిం చారు.  ఈరెండు గ్రామాల్లోను సాగునీటి ఎద్దడి ఎక్కు వగా ఉందని గుర్తించామన్నారు. వెంటనే సహాయ సంచాలకుడు షంషీ నీటిపారుదలశాఖ అధికారులతో సంప్రదించారు. బుధవారం రాత్రికి సాగునీరు అందే పరిస్థితి ఉందని సమాచారం ఇచ్చారు. పంట కాలువల్లో సాగునీటి మట్టం తక్కువడా ఉండడం వల్ల వరినాట్లు వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వివరించారు. కాలువల్లో నీటి మట్టాన్ని పెంచితేనే గానీ నాట్లు వేసుకో లేమని రైతులు చెప్పారు. అయితే దాళ్వా పంటకు పూర్తిస్థాయిలో నీటి విడుదల చేయకపోతే తాము  తీవ్రంగా నష్టపోతామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నీటి ఇంజన్లను అద్దెకు తీసుకుని పలువురు రైతులు వరినాట్లు వేసుకుంటు న్నారని, వాటి అద్దెలు విపరీతంగా పెరిగి పోయాయని, చివరకు డీజిల్‌ ధర కూడా పెరి గిపోవడంతో ఆ స్థాయిలో తాము పెట్టుబడులు పెట్టుకోలేమని పలు వురు రైతులు వ్యవసాయా ధికారులకు వివరించారు. వారి వెంట టీడీపీ రైతుసంఘ జిల్లా నాయకుడు మట్టా మహలక్ష్మిప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T06:32:06+05:30 IST