క్రీడలతో మానసికోల్లాసం

ABN , First Publish Date - 2021-11-30T04:54:24+05:30 IST

క్రీడలు మానసికోల్లా సంతో పాటు, శారీరక దేహదారుఢ్యం, ఆరోగ్యాన్ని కల్పిస్తాయని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం
ఆత్మకూర్‌లో నిర్వహించిన క్రికెట్‌ పోటీలో ప్రథమ బహుమతి సాధించిన జట్టుకు బహుమతి అందిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం

. మక్తల్‌ ఎమ్మెల్యే  చిట్టెం రామోహ్మన్‌రెడ్డి 

. ఆత్మకూర్‌ లో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీల ముగింపు

ఆత్మకూర్‌, నవంబరు 29: క్రీడలు మానసికోల్లా సంతో పాటు, శారీరక దేహదారుఢ్యం, ఆరోగ్యాన్ని కల్పిస్తాయని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. చిట్టెం యువసేన ఆధ్వర్యంలో ఈనెల 17న ఆత్మకూర్‌ పట్టణంలోని మినీ స్టేడియంలో ప్రారంభ మైన ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీల్లో వన పర్తి, గద్వాల, నారాయణపేట, పాలమూరు, నాగర్‌క ర్నూల్‌ జిల్లాల నుంచి 30 టీములు పాల్గొన్నాయి. సోమవారం ముగింపు కావడంతో చిట్టెం ముఖ్య అతి థిగా హాజరై, మాట్లాడారు. కాగా, పోటీల్లో రోహిత్‌ కొ ల్లం, ఎన్‌ఆర్‌ యువసేన జట్లు ఫైనల్‌లో తలపడగా రోహిత్‌ కొల్లం జట్టు ప్రథమ బహుమతి సాధించడం తో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రి రూ.50వేల నగ దు, రన్నరప్‌గా నిలిచిన ఎన్‌ఆర్‌ యువసేన జట్టుకు గడ్డమీది శ్రీనివాసులు రూ.30వేల నగదును అందిం చారు. ఆయా జట్లకు నగదుతో పాటు, షీల్డ్‌లను టీఆర్‌ఎస్‌ పట్టణ కార్యదర్శి గొల్ల రామకృష్ణ అందిం చారు. కార్యక్రమంలో  ఎంపీపీ బంగారు శ్రీనివాసు లు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, టీ ఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్‌, రైతు సమన్వయ సమితి సభ్యుడు వీరేశలింగం, వైస్‌ ఎంపీపీ కోటేశ్వర్‌, కమిష నర్‌ రమేష్‌, కౌన్సిలర్లు చెన్నయ్య, పోషన్న, రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.  


రాజావళి దర్గా వెండి నమూనాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

అమరచింత : 176 తులాల వెండితో తయారు చేసిన రాజావళి దర్గా వెండి నమూనాను సోమవారం అమరచింతలోని దర్గా ఆవరణంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. పట్టణంలోని జామా మసీదు నుంచి ప్రధాన రహదారి వెంట ముస్లిం సో దరులు ఆ దర్గా వెండి నమూనాను ఊరేగించారు. ఎమ్మెల్యే చిట్టెం దర్గా వెండి నమూనాను నెత్తిన పెట్టు కుని ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో తహ సీల్దార్‌ సింధూజ, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంగమ్మ, కౌన్సిలర్లు లక్ష్మీవిజయరాములు, రాజశేఖర్‌రెడ్డి, రాజ్‌ కుమార్‌, జామ మసీదు కమిటీ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు నర్సింలుగౌడ్‌, ప్ర చార కార్యదర్శి రఫీ తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2021-11-30T04:54:24+05:30 IST