ఎస్‌హెచ్‌జీలకు నిధులు మంజూరు

ABN , First Publish Date - 2020-08-10T10:32:42+05:30 IST

జిల్లాలోని మునిసిపాలిటీల్లో 6341 మహిళా స్వయం సహాయక సంఘాల పరిధి లో 80,368 మంది సభ్యులకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథ కాన్ని ..

ఎస్‌హెచ్‌జీలకు నిధులు మంజూరు

బొబ్బిలి ఆగస్టు 9: జిల్లాలోని మునిసిపాలిటీల్లో 6341 మహిళా స్వయం సహాయక సంఘాల పరిధి లో 80,368 మంది సభ్యులకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథ కాన్ని అమలుకు అధికారులు కసరత్తు ప్రారం భిం చారు. ఈ మేరకు రూ.175.24 కోట్లు మంజూరు చే స్తూ ప్రభుత్వం ఉత్వర్వులు  జారీ చేసింది.  గత ఏడాది ఏప్రిల్‌ 11 నాటికి రుణాలు పొందిన మహి ళలకు ఆసరా పథకం కింద వారి వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ చేసేందుకు  మెప్మా అధికారులు  చర్య లు ప్రారంభించారు. బ్యాంకుల ద్వారా రుణాల పొం దిన సంఘాలు, వాటి సభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచే పనిలో సిబ్బంది ఉన్నారు. బొబ్బిలిలో 434 సంఘాలలో 4593 మంది సభ్యులు ఉన్నారు.


వీరికి రూ.23 కోట్ల 11 వేలు మంజూరయ్యాయి. విజయనగరంలో 3,330 సంఘాలకు చెందిన  40,906 మంది సభ్యులకు రూ.98.45 కోట్లు, పార్వతీపురంలో 823 సంఘాల్లో 10,783 మంది సభ్యులకు రూ.23.08 కోట్లు, సాలూరులో 867 సంఘాలలో 11,115 మంది సభ్యులకు రూ.20.04 కోట్లు, నెలిమర్లలో 400 స్వ యం సహాయక సంఘాల పరిధిలో   5016 మంది సభ్యులకు రూ.9.84 కోట్లు మంజూరు చేస్తూ ప్రభు త్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.


దీంతో   స్వయం సహాయక సంఘాల సభ్యులు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మహిళా సభ్యురాలి వ్యక్తి గత ఖాతాలో రుణ మొత్తం జమయ్యేలా పారద ర్శకంగా ఆన్‌లైన్‌ ప్రక్రియ  పూర్తిచేయాలని ఆయా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభమైందని    మెప్మా ప్రాజెక్టు అధికారి సుగుణాకరరావు తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంలో మహిళా  సంఘ సభ్యు లకు సాయం అందించేందుకు నిధులు మంజూర య్యాయన్నారు.   గత ఏడాది ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని  మెప్మా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చా మని తెలిపారు.ఈ పనులు పూర్తయిన వెంటనే ఒక్కొ క్కరి ఖాతాలో తొలుత రూపాయి చొప్పున   జమ అవుతుందన్నారు.నిర్ధారణ చేసుకున్నాక వారు తీసు కున్న రుణమొత్తం ఖాతాలకు జమ అవుతుందన్నారు.  

Updated Date - 2020-08-10T10:32:42+05:30 IST