సీఎం దత్తత గ్రామాలపై వరాలజల్లు

ABN , First Publish Date - 2022-01-25T05:47:33+05:30 IST

సీఎం దత్తత గ్రామాలైన మర్కుక్‌ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు, ఎఫ్డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. మర్కుక్‌ మండలంలోని సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సమస్యలపై సోమవారం వారు సమీక్ష నిర్వహించారు. రెండు గ్రామాలకు 40 చొప్పున డబుల్‌ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశారు. ఎర్రవల్లి గ్రామంలోని లింగరాజుకుంట, ఎర్రగుంట, నల్లకుంట, మాచిరెడ్డికుంటల వద్ద ఔట్‌ఫ్లో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించారు.

సీఎం దత్తత గ్రామాలపై వరాలజల్లు
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ, కలెక్టర్‌

ఎర్రవల్లి, నరసన్నపేటలకు మరో 80 డబుల్‌బెడ్రూం ఇళ్లు

ఎర్రవల్లిలో కూరగాయల మార్కెట్‌, బస్టాండ్‌ నిర్మాణం


జగదేవ్‌పూర్‌, జనవరి 24: సీఎం దత్తత గ్రామాలైన మర్కుక్‌ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు, ఎఫ్డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. మర్కుక్‌ మండలంలోని సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సమస్యలపై సోమవారం వారు సమీక్ష నిర్వహించారు. రెండు గ్రామాలకు 40 చొప్పున డబుల్‌ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశారు. ఎర్రవల్లి గ్రామంలోని లింగరాజుకుంట, ఎర్రగుంట, నల్లకుంట, మాచిరెడ్డికుంటల వద్ద ఔట్‌ఫ్లో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించారు. మురికి కాల్వల నిర్మాణానికి నిధులిస్తున్నామని, 400 ఇళ్లలో సెప్టిక్‌ట్యాంకుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎర్రవల్లిలోని ఎర్రకుంటను మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలన్నారు. ఎర్రవల్లిలో కూరగాయల మార్కెట్‌, పశువైద్యశాల, బస్టాండ్‌ నిర్మాణం చేపట్టాలన్నారు. ఎస్సీ కాలనీ నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం నూతనంగా పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలన్నారు. తాత్కాలిక ఆశా వర్కర్‌లను రెగ్యులర్‌ చేయాలని, రేషన్‌ డీలర్‌ను నియమించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ ఈఎన్సీ సంజీవరావు, గడ అధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, జడ్పీటీసీ యెంబరి మంగమ్మరాంచంద్రంయాదవ్‌, దత్తత గ్రామాల సర్పంచ్‌లు భాగ్యభిక్షపతి, మాదవిరాజిరెడ్డి, ఎంపీటీసీ ధనలక్ష్మీకృష్ణ, అధికారులు బాలప్రసాద్‌, శ్రీనివా్‌సరెడ్డి, తహసీల్దార్‌ అహ్మద్‌ఖాన్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కమ్మరి బాలరాజు, డీడీసీ చైర్మన్‌ కిష్టారెడ్డి, నాయకులు వెంకటేశం, ప్రభాకర్‌ రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:47:33+05:30 IST