Abn logo
Mar 2 2021 @ 01:11AM

ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

 వేములవాడ, మార్చి 1:  వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం అభివృద్ధికి వెంటనే నిధులు కేటాయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఆలయ అభివృద్ధి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ఏటా వంద కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన విధంగా వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు.  మహాశివరాత్రి జాతర సందర్భంగా శివదీక్షస్వాములకు స్పర్శ దర్శనం కల్పించాలన్నారు. అనంతరం ఆలయ ఏఈవో హరికిషన్‌కు వినతిపత్రం అందజేశారు.  

Advertisement
Advertisement