నిధులు స్వాహా

ABN , First Publish Date - 2022-01-21T07:22:06+05:30 IST

నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న ఓ మిషనరీ పాఠశాల మోసాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి.

నిధులు స్వాహా

మోసాలకు అడ్డాగా మిషనరీ పాఠశాల

బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ నిధులు హాంఫట్‌ 

మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు 

లెక్కలు అడిగితే కేసులు పెడతామంటూ బెదిరింపులు

నల్లగొండ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న ఓ మిషనరీ పాఠశాల మోసాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని స న్మార్గంలో నడిపించాల్సిన యాజమాన్యం అందుకు వి రుద్దంగా వ్యవహరిస్తూ విద్యావ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా కొందరు మహిళా టీచర్లను లైంగికంగా వేధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


ప్రతీ ఏటా రూ.50లక్షల నిధులు

బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ కింద ప్రతిఏటా ఈ పాఠశాలకు రూ.50లక్షల వరకు నిధులు మంజూరవుతాయి. ఈ నిధుల ద్వారా పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఈ నిధులు పక్కదారి పడుతున్నట్లు వినికిడి. విద్యార్థినీ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా యాజమాన్యం ఆ సొమ్మును స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులు నుంచి ఒక్క నయా పైసా కూడా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఖర్చు చేయకపోవడం గమనార్హం. 


ఖరీదైన కార్లు, ఇళ్ల స్థలాలు 

2014లో వచ్చిన నిధుల ద్వారా అందులో పనిచేసే ఓ వ్యక్తి లక్షల రూపాయలు వెచ్చించి ఖరీదైన కారును కొనుగోలు చేసి ఉపయోగించుకుంటున్నారు. తనకు నచ్చిన వారికి ఇళ్ల స్థలాలతోపాటు ఇళ్లను కూడా ప్రభుత్వ సొమ్ముతోనే కొనుగోలు చేయించడం విమర్శలకు తావిస్తోంది. తాను ఆడిందే ఆట పా డిం దే పాటగా పాఠశాలలో వ్యవహరిస్తూ కొందరు మ హిళలను అసభ్య పదజాలాలతో దూషించడమే కా కుండా వారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు వినికిడి. 


జీతం అడిగితే బ్లాక్‌ మెయిలింగ్‌ 

జీతం అడుగుతున్న వారిని రాత్రివేళల్లో మద్యం తాగి మహిళా ఉపాధ్యాయులనే కాకుండా పురుష ఉపాధ్యాయులను కూడా బెదిరించడమే కాకుండా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అదేవిధంగా పాఠశాలలో నిర్వహించే ఉపాధ్యాయుల సమావేశాల్లో కూడా బూతు మాటలను ఉపయోగిస్తుండటంపై పలువురు మహిళా ఉపాధ్యాయినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కష్టకాలంలో ఇతర పాఠశాలల్లో 50శాతం లేదంటే 40శాతం జీతాలిచ్చి వారి కుటుంబాలను ఆదుకుంటుండగా, ఈ మిషనరీ పాఠశాలలో మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పలువురు టీచర్లు, నాన్‌టీచింగ్‌ వాపోతున్నారు. ఎవరైన ఇబ్బందులు ఎదుర్కొలేక సదరు బాస్‌ను నిలదీస్తే సాక్ష్యాలు ఏమీ లేవని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ వ్యాఖ్యానించడం విశేషం. 


కలెక్టర్‌, డీఈవోలకు ఫిర్యాదు 

ఇదిలా ఉండగా సదరు మిషనరీ పాఠశాల యాజమాన్య నిర్వాహకుల మూలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ సీనియర్‌ ఉపాధ్యాయుడు పూర్తి ఆధారాలతో లిఖిత పూర్వకంగా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతోపాటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఆందోళన నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


అంతా నా ఇష్టం.. ఈ ఆస్తి నాదే 

అంతా నా ఇష్టం, ఈ ఆస్తి అంతా నాదే అన్న విధంగా వ్యవహరిస్తూ సదరు వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కనీసం అందులో పనిచేసే వారికి ఈపీఎఫ్‌ కూడా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ పాఠశాలలో 70 పదుల వయస్సు దాటిన సదరు వ్యక్తి వికృత చేష్టలతో ఆ పాఠశాలలో పనిచేయాలంటేనే ఉపాధ్యాయినులు భయాందోళనకు గురవుతున్నట్లు చర్చ సాగుతోంది. వాస్తవానికైతే మిషనరీ పాఠశాల నిబంధనల మేరకు 2 నుంచి 3 సంవత్సరాల వరకే విధుల్లో ఉండాల్సి ఉండగా, 6 సంవత్సరాలుగా అదే పోస్టులో కొనసాగుతూ పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌ను భ్రష్ఠు పట్టిస్తూ లక్షల రూపాయలు స్వాహా చేస్తుండటంతో పాఠశాల పరువు పోతుందన్న ఆవేదన టీచర్ల నుంచి వ్యక్తమవుతోంది. 


ఎవరైనా ఎదిరిస్తే.. బెదిరిస్తారు 

కరోనా తీవ్రతతో ఉపాధ్యాయులకు వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా కనీసం వారికి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వడంలేదు. గత ఆరు నెలలుగా 14 మంది టీచర్లకు, ఎనిమిది మంది ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. పాఠశాలకు బీఏఎస్‌ స్కీమ్‌ కింద ఏటా రూ.50లక్షలు వచ్చినా పిల్లలకు పుస్తకాలతోపాటు దుస్తులు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఎవరైన లెక్కలు అడిగితే వారిని ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెడతామంటూ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-01-21T07:22:06+05:30 IST