పిల్లల కోసం ఫన్నీ ఫుడ్‌ ఆర్ట్‌

ABN , First Publish Date - 2020-07-08T05:30:00+05:30 IST

పిల్లలు పలు రంగుల్లో ఆకర్షణీయంగా ఉన్న ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. వారికి నచ్చిన ఫుడ్‌ అయితే రోజంతా అదే ఫుడ్‌ లాగించేస్తారు. దాంతో వారికి హెల్తీఫుడ్‌ అందడం లేదని తల్లులు వాపోతుంటారు...

పిల్లల కోసం ఫన్నీ ఫుడ్‌ ఆర్ట్‌

పిల్లలు పలు రంగుల్లో ఆకర్షణీయంగా ఉన్న ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. వారికి నచ్చిన ఫుడ్‌ అయితే రోజంతా అదే ఫుడ్‌ లాగించేస్తారు. దాంతో వారికి హెల్తీఫుడ్‌ అందడం లేదని తల్లులు వాపోతుంటారు. వీరి సమస్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు తల్లులు పరిష్కారం చూపుతున్నారు. 





కార్టూన్‌ బొమ్మలుగా ...

మలేషియాకు చెందిన ఫుడ్‌ ఆర్టిస్ట్‌ సమంతా లీ ఫుడ్‌ను డిస్నీ క్యారెక్టర్ల రూపంలో అమర్చి తన ఇద్దరు పిల్లలకు అందిస్తున్నారు. ఆమె ఫుడ్‌ ఆర్ట్‌ను సోషల్‌ మీడియాలో ఎంతో మంది అనుసరిస్తున్నారు. జపాన్‌కు చెందిన ఫుడ్‌ ఆర్ట్‌ బ్లాగర్‌ ఇటోని మమా ఫుడ్‌ను కార్టూన్‌ బొమ్మలు, జంతువుల బొమ్మలుగా అలంకరిస్తున్నారు. గుడ్లు తినమంటే మారాం చేసే పిల్లలకు ఫ్రై చేసిన గుడ్లను సలాడ్స్‌, అన్నం, పండ్ల ముక్కల మీద వేసి అందించాలని తల్లులకు సూచిస్తున్నారు. జాకబ్‌ ఫుడ్‌ డెయిరీలో పనిచేసే లలేహ్‌ మహ్మదీ తన కుమారుడికి ఫన్నీ ఫుడ్‌ ఆర్ట్‌ ద్వారా ఆరోగ్యకరమైన ఫుడ్‌ అలవాటు చేశారు. ఆమె ఇన్‌స్టా పేజీ కామిక్‌ బుక్‌ను తలపిస్తుంది. 

Updated Date - 2020-07-08T05:30:00+05:30 IST