Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ఫొటోలో కనిపిస్తున్న వరుడు జైలు నుంచి వచ్చాడు.. పెళ్లయ్యాక మళ్లీ జైలుకే వెళ్లిపోయాడు.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: పైన ఫొటోలో కనపిస్తున్న వరుడు సరిగ్గా ముహూర్తం సమయానికి జైలు నుంచి పెళ్లి మండపానికి చేరుకున్నాడు. వధువు మెడలో తాళి కట్టి, ఆ తర్వాత తిన్నగా మళ్లీ జైలుకే వెళ్లిపోయాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వరుడు జైలుకు వెళ్లడానికి కారణం ఆ వధువే. ఏంటీ అంతా గందరగోళంగా ఉందా. వరుడిపై వధువు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి.. తిరిగి అతడినే పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. 


బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన స్వప్న కుమారి (పేరు మార్చడం జరిగింది), రాజ్‌కుమార్ గుప్తా ఇద్దరూ పాట్నాలోని ఒకే కాలేజీలో చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో.. మూడేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చదువు పూర్తైన తర్వాత తమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని అనుకుంటున్నట్టు తెలిపారు. అయితే ఇద్దరి కులాలు వేరవడంతో.. వారి పెళ్లికి స్వప్న తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే రాజ్‌కుమార్ గుప్తా కూడా సడన్‌గా ప్లేట్ పిరాయించాడు. స్వప్నను వివాహం చేసుకునేందకు నిరాకరించాడు. దీంతో రాజ్‌కుమార్ గుప్తాపై స్వప్న.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. 


శుక్రవారం రోజు కోర్టులో ఈ కేసు విచారణకు రావడంతో.. తమ పెళ్లి జరిపించాలని జడ్జిని స్వప్న కోరింది. దీంతో న్యాయమూర్తి ఓమ్ ప్రకాశ్ సింగ్.. సానుకూలంగా స్పందించారు. దగ్గరుండి స్వప్న పెళ్లి జరిపించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రాజ్‌కుమార్ గుప్తాను పోలీసులు.. కోర్టు ప్రాంగణంలోని గుడి వద్ద ఏర్పాటు చేసిన మండపానికి శనివారం తీసుకొచ్చారు. ఈ క్రమంలో రాజ్‌కుమార్.. స్వప్న మెడలో తాళి కట్టాడు. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులూ హాజరయ్యారు. కాగా.. రాజ్‌కుమార్‌పై స్వప్న పెట్టిన కేసును కోర్టు కొట్టివేయకపోవడం వల్ల.. అతడిని పోలీసులు తిరిగి జైలుకు తరలించారు. దీంతో ఈ పెళ్లి వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement