పాక్‌ నుంచి డ్రోన్ల ద్వారా ‘ఉగ్ర’ ఆయుధాలు

ABN , First Publish Date - 2020-09-23T07:39:57+05:30 IST

సరిహద్దుల్లో భారత్‌ గట్టి నిఘాను ఏర్పాటు చేయడంతో.. జమ్మూకశ్మీర్‌లోని వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు ఆయుధాలు చేరవేసేందుకు పాక్‌ కొత్త

పాక్‌ నుంచి డ్రోన్ల ద్వారా ‘ఉగ్ర’ ఆయుధాలు

 గుర్తించిన జమ్మూకశ్మీర్‌ పోలీసులు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: సరిహద్దుల్లో భారత్‌ గట్టి నిఘాను ఏర్పాటు చేయడంతో.. జమ్మూకశ్మీర్‌లోని వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు ఆయుధాలు చేరవేసేందుకు పాక్‌ కొత్త ఎత్తుగడ వేసింది. డ్రోన్ల సాయంతో ఏకే-47 వంటి ఆయుధాలను నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)ను దాటిస్తోంది. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్‌ పోలీసులు నిర్ధారించారు. జైష్‌-ఎ-మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.


సోమవారం రాత్రి సరిహద్దులోని అఖ్నూర్‌ గ్రామం వద్ద అలా జారవిడిచిన ఆయుధాలు, తూటాలను.. జాడ్‌ సోహల్‌ గ్రామం వద్ద రెండు ఏకే-47 రైఫిళ్లు, మూడు ఏకే-47 మేగజీన్లు, 90 తూటాలు, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో కూడా పంజాబ్‌ రాష్ట్రంలో ఎల్‌వోసీ వెంబడి ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి.


 

Updated Date - 2020-09-23T07:39:57+05:30 IST