Abn logo
Nov 25 2021 @ 16:38PM

ఈ కంపెనీ విద్యుత్తు వాహనం... ఫ్యూచర్‌ సూపర్‌... అందుకేనా..?

హైదరాబాద్ : సుప్రజీత్ ఇంజనీరింగ్ స్టాక్ ఓ రేంజ్‌లో ఉంది. కొన్ని రోజులుగా కరెక్షన్‌లో ఉన్న్నప్పటికీ... నెల మొత్తంగా చూస్తే మాత్రం 27 % లాభపడింది. ఆటోమొబైల్ కంపెనీల కోసం కేబుల్స్ తయారుచేసే ఈ కంపెనీ... దాని గ్లోబల్ రీచ్, రెవెన్యూలో విద్యుత్తు వాహనాల(ఈవీ) షేర్‌ను క్రమంగా పెంచుకుంటూ ముందుకెళుతోంది. విద్యుత్తు బైక్స్‌ వస్తే, సాంప్రదాయ బైక్‌ కేబుల్‌ వ్యాపారం తగ్గిపోతుందేమోనన్న ఇన్వెస్టర్ల ఆందోళనకు, ప్రస్తుత ఈవీ గ్రోత్‌తో చెక్‌ పడింది. నార్వేకు చెందిన కాంగ్స్‌బర్గ్ కంపెనీలోని లైట్ డ్యూటీ కేబుల్(ఎల్‌డీసీ) డివిజన్‌ను కొనుగోలు చేసి, గ్లోబల్ ఫుట్‌ప్రింట్‌‌‌ ను మరింత పెంచింది.


ఈ క్రమంలో... సుప్రజిత్ వార్షిక కేబుల్ ఉత్పత్తి సామర్థ్యం 300 మిలియన్ల నుంచి 400 మిలియన్ యూనిట్లకు పెరుగుతుంది. తద్వారా... ప్రపంచంలో అతి పెద్ద కేబుల్ తయారీ కంపెనీ హైలెక్స్ సామర్ధ్యానికి దాదాపు దగ్గరగా వచ్చింది. ఈ అక్విజిషన్‌ కాకుండా, మెక్సికో, హంగరీ, చైనాల్లో కూడా మూడు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లు కంపెనీకి ఉన్నాయి. వెహికల్‌ బాడీ, డోర్‌ కేబుల్స్‌ విషయంలో సుప్రజీత్ ప్రస్తుత వ్యాపారం... చాలా స్ట్రాంగ్‌గా ఉండగా, సీట్‌ కేబుల్స్‌ విషయంలో, కొనుగోలు చేసిన వ్యాపారానిదే... ఆదాయంలో సింహభాగం. క్రాస్ సెల్లింగ్ పెంచడానికి ఇక్కడ అవకాశముంటోంది. లీడింగ్‌ ఆటోమేకర్స్‌ ఫియట్, ల్యాండ్ రోవర్, హోండా, హస్క్‌వర్నాకు కేబుల్స్‌ను కాంగ్స్‌బర్గ్ అందిస్తుండగా, , బీఎండబ్ల్యూ, వోక్స్‌వ్యాగన్, ఫోర్డ్, జీఎంకు సుప్రజీత్ సరఫరా చేస్తోంది. అదనంగా చేరిన క్లయింట్లు  కంపెనీకి అదనపు సానుకూలత. కేబుల్ వ్యాపారం ద్వారా ప్రస్తుతం వస్తోన్న 170-190 మిలియన్ డాలర్ల  (సుమారు రూ. 1,400 కోట్లు) రెవెన్యూకు, ఎల్‌డీసీ డివిజన్ ద్వారా మరో 100 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 740 కోట్లు) అదనంగా వచ్చి చేరవచ్చు.


ఇక మొత్తం రెవెన్యూలో గ్లోబల్‌ రెవెన్యూ షేర్‌ 2021 ఆర్ధిక సంవత్సరంలో 58 %. ఇది... నాలుగేళ్ల క్రితం 18 % ఉండగా, ప్రస్తుతం ఎల్‌డీసీ డివిజన్ రాకతో ఇంకా పెరుగనుందని భావిస్తున్నారు. మార్కెట్ షేర్‌, కంటెంట్ స్కోప్‌ పరిమితంగా ఉన్న ద్విచక్ర వాహనాల కేబుల్ బిజినెస్‌పై కంపెనీ ఆధారపడడం కూడా ఇకపై తగ్గుతుంది. విద్యుత్తు వాహనాలు పెరిగినపక్షంలో, కేబుళ్ళ  వినియోగంలో మార్పులు వస్తాయి తప్ప, వ్యాపారం తగ్గే పరిస్థితి ఉండదు కనుక, ఇన్వెస్టర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.  విద్యుత్తు వాహనాల నుంచి సుప్రజిత్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్‌ ప్రస్తుతమున్న 5 % నుంచి, వచ్చే మూడేళ్లలో దాదాపు 22 % కు  పెరుగుతుందని అంచనా. 


ఈ కంపెనీ వోక్స్‌వ్యాగన్‌కు డోర్ కేబుళ్ళు, హూడ్ రిలీజ్ కేబుళ్ళ సరఫరా చేస్తోంది. ఎల్‌డీసీ డిబిజన్‌ టెస్లా, బీవైడీ వంటి గ్లోబల్‌ విద్యుత్తు వాహనాల తయారీదారులకు కేబుళ్ళను అందిస్తోంది. నిన్న(బుధవారం) ₹428 వద్ద ముగిసిన స్టాక్‌, దీర్ఘకాల సగటు వాల్యుయేషన్‌ 20 తో పోలిస్తే, వన్‌ ఇయర్‌ ఫార్వర్డ్‌ ఎర్నింగ్స్‌కు 24 రెట్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిలో రికవరీ కారణంగా ఈ ప్రీమియం కొనసాగవచ్చని భావిస్తున్నారు.