Abn logo
Jan 20 2021 @ 03:21AM

‘గంటా’ కుమార్తె ఇంట్లో భారీ చోరీ

సాగర్‌నగర్‌(విశాఖ) : మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. గంటా కుమార్తె సాయి పూజిత కుటుంబం రుషికొండలోని బాలాజీ బేమౌంట్‌ విల్లాలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 10న ఆమె కుటుంబ సమేతంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అత్తవారింటికి వెళ్లి, తిరిగి 11న, తమ ఇంటికి కాకుండా.. ఎంవీపీ కాలనీలోని తండ్రి గంటా ఇంటికి వచ్చారు. ఏదో వస్తువు అవసరమవడంతో ఇంట్లో ఒకరిని విల్లాకు పంపించగా చోరీ విషయం బయటపడింది. రూ.పది లక్షల  విలువ చేసే బంగారం, డైమండ్‌ చెవిదిద్దులు, ఇతర వెండి వస్తువులు చోరీకి గురైనట్లు తేలింది. దీనిపై పాలెం పోలీసులకు ఫిర్యాదు అందింది. సాయి పూజిత ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement