Abn logo
Sep 25 2021 @ 12:56PM

హైకోర్టును ఆశ్రయించిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ వ్యాపారులు

హైదరాబాద్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై పండ్ల వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 25 నుండి మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారులు ప్రకటించారు. కొహెడలో నూతన మార్కెట్ నిర్మాణం చేసే వరకు బాట సింగారంలో తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఉన్న మార్కెట్ స్థలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణo చేయనున్నట్టు స్పష్టం చేస్తూ  ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే పండ్ల వ్యాపారులు ఖాళీ చేసేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది. కాగా ఉన్న పలంగా మార్కెట్ నుండి ఖాళీ చేయలేమని వ్యాపారులు స్పష్టం చేశారు. ఖాళీ చేసేందుకు ఈ నెల 30  వరకు సమయం ఉన్నా 25 నుండే మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారుల ప్రకటన చేశారు. ఇతర రాష్ట్రాల నుండి పండ్లు వస్తున్న సమయంలో ఇప్పుడు మార్కెట్ మూసివేత ప్రకటనపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. తాత్కాలిక మార్కెట్‌లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు  సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. 

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...