యూట్యూబ్‌ నుంచి నాకు ప్రతి నెలా రూ.4 లక్షలు

ABN , First Publish Date - 2021-09-18T07:56:32+05:30 IST

యూట్యూబ్‌ నుంచి తనకు ప్రతినెలా రూ.4 లక్షలు రాయల్టీగా వస్తాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. తన వీడియోలకు వ్యూవర్‌షిప్‌ పెరిగిన కారణంగా యూట్యూబ్‌ తనకు ఆ రాయల్టీని...

యూట్యూబ్‌ నుంచి నాకు ప్రతి నెలా రూ.4 లక్షలు

  • కరోనా కాలంలో తానేం చేశారో వెల్లడించిన గడ్కరీ

బరూచ్‌, సెప్టెంబరు 17: యూట్యూబ్‌ నుంచి తనకు ప్రతినెలా రూ.4 లక్షలు రాయల్టీగా వస్తాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. తన వీడియోలకు వ్యూవర్‌షిప్‌ పెరిగిన కారణంగా యూట్యూబ్‌ తనకు ఆ రాయల్టీని చెల్లిస్తోందని చెప్పారు.  గుజరాత్‌లోని భరూచ్‌లో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేపై శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.  ‘‘కరోనా మహమ్మారి కాలంలో నేను చెఫ్‌గా మారి ఇంట్లో వంటలు వండాను. దాంతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా లెక్చర్లు ఇచ్చాను. విదేశీ యునివర్సిటీలు, విద్యార్థులకూ పాఠాలు చెప్పాను. ఆన్‌లైన్‌లో 950పైగా లెక్చర్లు ఇచ్చాను. ఆ వీడియోలన్నీ  యూట్యూబ్‌ చానెల్‌లో అప్‌లోడ్‌ చేయడంతో వాటిని చూసేవారు పెరిగారని, దాంతో యూట్యూబ్‌ ప్రతినెలా రూ.4 లక్షలు రాయల్టీగా చెల్లిస్తోంది’’ అని గడ్కరీ వివరించారు.


Updated Date - 2021-09-18T07:56:32+05:30 IST