అందుకే రాయుడిని ఎంపిక చేయలేదు!

ABN , First Publish Date - 2020-08-10T09:16:05+05:30 IST

గత వన్డే వరల్డ్‌కప్‌ (2019) జట్టుకు హైదరాబాద్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడంపై

అందుకే రాయుడిని ఎంపిక చేయలేదు!

న్యూఢిల్లీ: గత వన్డే వరల్డ్‌కప్‌ (2019) జట్టుకు హైదరాబాద్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడంపై అప్పట్లో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. సీనియర్‌ అయిన రాయుడిని కాదని ‘3డీ’ పేరిట తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు సెలెక్టర్లు చోటు కల్పించడాన్ని పలువురు మాజీలు బాహాటంగానే తప్పుబట్టారు. అయితే, మెగా టోర్నీలో ఆడేంత ఆత్మవిశ్వాసం రాయుడికి లేకపోవడమే అతడిని తప్పించడానికి కారణమని నాటి సెలెక్షన్‌ కమిటీ సభ్యుడైన గగన్‌ ఖోడా వెల్లడించాడు. ‘అంబటి రాయుడు సీనియర్‌ క్రికెటర్‌. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొనే ఏడాదిగా అతడికి అవకాశాలు ఇచ్చాం. కానీ, వాటిని అతడు అందిపుచ్చుకోలేక పోయాడు. వరల్డ్‌కప్‌లో ఆడేంత ఆత్మవిశ్వాసమూ అతడిలో కనిపించలేదు. అందుకే అతడిని పక్కకుపెట్టాం’ అని ఖోడా వివరించాడు. 

Updated Date - 2020-08-10T09:16:05+05:30 IST