‘గగన్‌యాన్‌’ శిక్షణ పునఃప్రారంభం

ABN , First Publish Date - 2020-05-24T07:20:00+05:30 IST

గగన్‌యాన్‌ మిషన్‌ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములకు రష్యాలో శిక్షణ తిరిగి ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న ప్రారంభమైన వీరి శిక్షణకు కరోనా వ్యాప్తి...

‘గగన్‌యాన్‌’ శిక్షణ పునఃప్రారంభం

బెంగళూరు, మే 23: గగన్‌యాన్‌ మిషన్‌ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములకు రష్యాలో శిక్షణ తిరిగి ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న ప్రారంభమైన వీరి శిక్షణకు కరోనా వ్యాప్తి కారణంగా అంతరాయం కలిగింది. గగారిన్‌ రీసెర్చ్‌ అండ్‌ టెస్ట్‌ కాస్మోనాట్‌ సెంటర్‌ (జీసీటీసీ) మే 12 నుంచి భారతీయ వ్యోమగాములకు శిక్షణను తిరిగి ప్రారంభించిందని రష్యన్‌ స్పేస్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. అంతరిక్ష విహారంలో మెలకువలు, మానవ సహిత అంతరిక్ష నౌక నియంత్రణకు సంబంధించిన ప్రాథమిక అంశాలతో పాటు రష్యన్‌ భాషపై వారికి ప్రత్యేక థియరీ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆ నలుగురూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని పేర్కొంది. కరోనా, ఇతర అంటువ్యాధుల నుంచి రక్షణ కోసం జీసీటీసీలో అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.  భారత జాతీయ జెండాతో ఉన్న స్పేస్‌ సూట్లు ధరించిన వ్యోమగాముల చిత్రాన్ని రోస్‌కాస్మోస్‌ శుక్రవారం ట్వీట్‌ చేసింది.


Updated Date - 2020-05-24T07:20:00+05:30 IST