నాగిరెడ్డిపేట పోలీసు స్టేషన్‌లో గలాటా

ABN , First Publish Date - 2021-02-25T04:41:52+05:30 IST

పోలీసు శాఖ అంటేనే క్రమశిక్షణ.. నేరస్తులను శిక్షించడం, ప్ర జలకు భరోసానివ్వడం, ఆదర్శంగా నిలవడం, ఆశాఖ కు చెందిన అధికారులు, సిబ్బంది మొట్టమొదటి కర్తవ్యం.

నాగిరెడ్డిపేట పోలీసు స్టేషన్‌లో గలాటా

 ఎస్‌ఐ ఉండగానే ఘర్షణకు దిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు 

పెట్రోలింగ్‌ బైక్‌ విషయంలో ఘర్షణ 

ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఓ కానిస్టేబుల్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖ అంటేనే క్రమశిక్షణ.. నేరస్తులను శిక్షించడం, ప్ర జలకు భరోసానివ్వడం, ఆదర్శంగా నిలవడం, ఆశాఖ కు చెందిన అధికారులు, సిబ్బంది మొట్టమొదటి కర్తవ్యం. కానీ కొందరు కానిస్టేబుల్‌లు కట్టుతప్పుతు న్నారు. విధుల్లో ఉండగానే వ్యక్తిగత కారణాలతో, విద్వేషాలతో ఘర్షణలకు దిగుతూ ఒకరిపై ఒకరు ఘర్షణలకు దిగుతూ పై స్థాయి అధికారులకు ఫిర్యా దులు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓ వైపు అవినితీ ఆరోపణలు, పాస్‌పోర్టు కుంభకోణాలతో పోలీసుశాఖ అభాసుపాలు అవుతుండగా.. నాగిరెడ్డిపేట పోలీసు స్టేషన్‌లోనే ఇద్దరు కానిస్టేబుళ్లు గలాటకు దిగడం ఎల్లారెడ్డి పోలీసు డివిజన్‌ పరిధిలో తీవ్ర చర్చనీ యాంశంగా మారింది.

పీఎస్‌లోనే ఘర్షణకు దిగిన కానిస్టేబుళ్లు

ఎల్లారెడ్డి పోలీసు సబ్‌డివిజన్‌ పరిధిలోని నాగిరె డ్డిపేట పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఇద్దరు కానిస్టేబు ళ్లు నువ్వా.. నేనా అన్నరితీలో ఘర్షణకు దిగిన సం ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లు మంగళవా రం సాయంత్రం వేళలో పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే పెట్రోలింగ్‌ బైక్‌ విష యమై ఘర్షణకు దిగినట్లు తెలిసింది. గత కొంతకా లంగా ఇద్దరి కానిస్టేబుళ్ల మధ్య విబేధాలు ఉన్నాయ ని, దింతోనే వారిద్దరు పెట్రోలింగ్‌ బైక్‌ విషయంలో మాటమాట పెంచుకుని స్టేషన్‌ ఆవరణలోనే చొక్కా లు పట్టుకుని ముష్టియుద్ధానికి దిగినట్లు తెలిసింది. ఎస్‌ఐ స్టేషన్‌లో ఉండగానే స్టేషన్‌ ఆవరణలో పరస్ప ర దాడులకు పాల్పడడాన్ని అటువైపుగా వెళ్తున్న ప్ర జలు చూస్తు నివ్వెరపోయారు. పోలీసులే ఘర్షణకు దిగితే నేరస్తులు ఎలా కట్టడి చేస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఘర్షణకు దిగిన వారిలో ఓ కానిస్టే బుల్‌ ఎస్పీ శ్వేతారెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచా రం. ఇదిలా ఉండగా ఘర్షణ విషయమై డివిజన్‌ స్థా యి పోలీసు అధికారిని, సర్కిల్‌ అధికారులను  వివ రణ కోరగా తమకు ఏమి తెలియదని సమాధానం దాటవేశారు. డివిజన్‌స్థాయి అధికారులు బుధవారం పోలీసుస్టేషన్‌కు వెళ్లి విచారణ జరిపినట్లు తెలిసింది.

Updated Date - 2021-02-25T04:41:52+05:30 IST