‘గాలి సంపత్‌’ సినిమా చిత్రీకరణ

ABN , First Publish Date - 2020-12-04T05:34:48+05:30 IST

మండలంలో గడుగుపల్లి గ్రామ సమీపంలో గురువారం గాలి సంపత్‌ సినిమాలోని పలు సన్నివేశాలను చిత్రీకరించారు.

‘గాలి సంపత్‌’ సినిమా చిత్రీకరణ
గడుగుపల్లి గోదాం వద్ద ఫైట్‌ సీన్‌ను చిత్రీకరిస్తున్న దృశ్యం

హుకుంపేట, డిసెంబర్‌ 3: మండలంలో గడుగుపల్లి గ్రామ సమీపంలో గురువారం గాలి సంపత్‌ సినిమాలోని పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అనిల్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి హీరో హీరోయిన్‌లుగా శ్రీవిష్ణు, లౌలి సింగ్‌ నటిస్తున్నారు. అలాగే కథ, నిర్మాతగా ఎస్‌.కృష్ణ వ్యవహరిస్తున్నారు. తండ్రీకొడుకులకు సంబంధించి అంశంపై ఈ చిత్రం రూపొందిస్తున్నామని, ఏజెన్సీలో అందాల్లో మరో వారం రోజులు పలు సన్నివేశాలను చిత్రీకరిస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు తెలిపారు. గురువారం గడుగుపల్లి వద్ద ఉన్న ఓ గోదాం వద్ద హీరో శ్రీవిష్ణుపై ఫైట్‌ సీన్‌ను చిత్రీకరించారు.  

Updated Date - 2020-12-04T05:34:48+05:30 IST