రైతుల సంకల్ప ర్యాలీ.. ట్రాక్టర్ నడిపిన గల్లా జయదేవ్

ABN , First Publish Date - 2021-01-20T19:31:18+05:30 IST

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్వయంగా ట్రాక్టర్ నడిపారు.

రైతుల సంకల్ప ర్యాలీ.. ట్రాక్టర్ నడిపిన గల్లా జయదేవ్

విజయవాడ: అమరావతి ఉద్యమానికి బుధవారం నాటికి 400వ రోజుకి చేరుకున్నాయి. అరెస్టులు, నిర్బంధాలు, లాఠీ చార్జ్‌లు, అడ్డగింపులు లాంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉద్యమంలో రైతులు ముందుకు ఉరుకుతున్నారు. ఢిల్లీ రైతుల నిరసన దీక్షల స్ఫూర్తితో అమరావతి రైతులు భారీ బైక్, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొని మరోసారి రైతుల ఐక్యతను కులమతాలకు అతీతంగా చాటి చెప్పారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్వయంగా ట్రాక్టర్ నడిపారు.


ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళా రైతులు, రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు బుధవారం నాటికి 400వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉద్యమంలో కొత్త స్ఫూర్తిని రగిల్చేందుకు అమరావతి సంకల్ప ర్యాలీని నిర్వహించారు. ఢిల్లీ రైతుల ఉద్యమం స్ఫూర్తితో అమరావతి రైతులు బైక్, ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ తుళ్లూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్లమాను, హరిచంద్రపురం,  బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజు పాలెం, రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి మీదుగా మందడం వరకు సాగనుంది. ఈ ర్యాలీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోపాటు.. గత కొన్ని రోజులుగా తాము చేస్తున్న దీక్షలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-01-20T19:31:18+05:30 IST