ఆట అయిపోయింది: మోదీ

ABN , First Publish Date - 2021-04-04T06:45:39+05:30 IST

ఈసీ, కేంద్రబలగాలు అంపైర్ల లాంటివని, వాటిని మమత దూషిస్తున్నారంటే బెంగాల్లో ఖేలా శేష్‌(ఆట అయిపోయినట్లేనని) ప్రధాని మోదీ

ఆట అయిపోయింది: మోదీ

ఈసీ, కేంద్రబలగాలు అంపైర్ల లాంటివని, వాటిని మమత దూషిస్తున్నారంటే బెంగాల్లో ఖేలా శేష్‌(ఆట అయిపోయినట్లేనని) ప్రధాని మోదీ హరిపాల్‌ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. మమత నినాదం ఖేలా హోబె(ఆట మొదలైంది)కు కౌంటర్‌గా ఆయన ఈ మాటన్నారు.


‘‘దీదీది ఆటంకవాద మనస్తత్వం. అన్నింటికీ అడ్డుచెప్పే నైజం. అందుకే ఇప్పటిదాకా పరిశ్రమలు రాలేదు. పెట్టుబడులు రాలేదు. సింగూర్‌లో ఏం జరిగిందో మనం చూశాం’’ అని మోదీ అన్నారు. బెంగాలీ ఆత్మగౌరవ నినాదాన్ని వినిపిస్తున్న మమతకు మరో కౌంటర్‌ ఇస్తూ ‘డబ్బులు తీసుకుని బీజేపీ సభలకు ప్రజలు వస్తున్నారని మమత ఆరోపించారు. అంటే ఆమె బెంగాలీలను అవమానించారు. దీదీ!ప్రజలు డబ్బులు తీసుకుని ఇలా వస్తారా? నందిగ్రామ్‌లో పోలింగ్‌ నాడే తాను ఓడిపోతున్నట్లు ఆమె గ్రహించారు. నిస్పృహతో ఈ మాటలంటున్నారు. నన్ను తిట్టి నా ఫరవాలేదు. కానీ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆమె దెబ్బతీస్తున్నారు’’ అని మోదీ ఆక్షేపించారు.


బీజేపీని పరాయివారని విమర్శించడం నేతాజీ సుభాష్‌ చంద్రబో్‌సను అవమానించడమే అన్నారు. ‘‘దేశాన్ని బ్రిటి్‌షవారు విభజించినపుడు దేశమం తా ఒకటే. అన్ని ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలూ ఒకటే అని నేతాజీ అన్నారు. దాన్ని సమర్థించాల్సిన టీఎంసీ మమ్మ ల్ని బయటివారంటోంది. ఈ దేశ పౌరులంతా భరతమాత బిడ్డలు. గెలుపు మాదే. ఈ గడ్డపై పుట్టిన వ్యక్తే మే 2వ తేదీన బీజేపీ ప్రభుత్వం తరఫున సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా రు. ఆ ప్రమాణస్వీకారానికి నేను కూడా హాజరవుతా’’ అని మోదీ ప్రకటించారు.


అసోంలోని బోడోలాండ్‌ ప్రాంతంలోనూ మోదీ ప్రసంగించారు. హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని బోడో మిలిటెంట్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ జమానాలో హింసే జరిగేదని, తాము అధికారంలో ఉన్న ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల అనేక ఉగ్రవాద గ్రూపు లు శాంతి బాట పట్టాయని మోదీ బక్సా జిల్లాలోని తాముల్పూర్‌లో జరిగిన సభలో చెప్పుకొచ్చారు. 


Updated Date - 2021-04-04T06:45:39+05:30 IST