Advertisement
Advertisement
Abn logo
Advertisement

గేమింగ్‌, కామెడీ వీడియోలే టాప్‌ యూట్యూబ్‌ వెల్లడి

భారతదేశంలో టాప్‌లో నిలిచిన వీడియోలను యూట్యూబ్‌ విడుదల చేసింది.  2021లో బ్రౌజ్‌ చేసిన వీడియోల్లో గేమింగ్‌, కామెడీ వీడియోలకే యూజర్లు ప్రయారిటీ ఇచ్చారని యూట్యూట్‌ తెలిపింది. ఆ మేరకు విడుదల చేసిన చార్ట్‌లో గేమింగ్‌ అత్యున్నత స్థానంలో ఉంది. కథలు చెప్పడం, కమ్యూనిటీ బిల్డింగ్‌లో గేమింగ్‌ ఉపయోగపడుతోంది. ఈ జాబితాతో పాపులర్‌ క్రియేటర్స్‌ను పరిచయం చేయడం తద్వారా మరింత మంది కొత్తవారికి ఉత్సాహం కలిగించడం ఈ చార్ట్‌ రూపకల్పన ఉద్దేశం. ప్రాంతీయ భాషలకు విస్తరించడం ద్వారా ప్రతి కంటెంట్‌ క్రియేటర్‌ అలాగే వినియోగదారుల అవసరం తీర్చడం కూడా లక్ష్యంగా ఉంది. నలభై నిమిషాల నిడివి కలిగిన జాంబియా షార్ట్‌ ఫిల్మ్‌ ‘రౌండ్‌ టు హెల్‌’కు చెందిన హార్రర్‌, కామెడీ ఫిల్మ్‌  జాంబి ప్రథమ స్థానంలో నిలిచింది. వివిధ భాషలకు తోడు తెలుగులో 30  వెడ్స్‌ 21, సూర్య సైతం యూట్యూబ్‌లో టాప్‌ షోల కింద నిలిచాయి. 

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...