Abn logo
Jul 30 2020 @ 10:23AM

పుస్తెల తాడుతో గొంతు బిగించి.. హతమార్చి.. అనుమానం రాకుండా..

గణపవరం(పశ్చిమ గోదావరి): భార్యను హత్య చేసిన భర్తను అరెస్టు చేసినట్టు ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ తెలిపారు. గణపవరం పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. పిప్పరకు చెందిన మేడా అబ్బులు భార్య నంగాలమ్మ(23)తో ఒక చేపల చెరువుపై పని చేస్తూ నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన అబ్బులు భార్యపై అనుమానం పెంచుకుని తరచూ కొట్టేవాడు.


ఈ నెల 18వ తేదీ రాత్రి పుస్తెల తాడుతో గొంతు బిగించి హత్యచేశాడు. అనుమానం రాకుండా బీరు సీసాతో తానూ పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం సోదరుడి ఇంటికి వెళ్లి విషయం తెలిపాడు. గతంలో అబ్బులుకు వివాహమవగా మనస్పర్థల వల్ల మొదటి భార్యను వదిలేసి గణపవరానికి చెందిన నంగాలమ్మను రెండో వివా హం చేసుకున్నాడు. వీరికి తొమ్మిది నెలలు బాబు ఉన్నాడు. ప్రస్తుతం నంగాలమ్మ నాలుగు నెలల గర్భిణీ. అబ్బులును అరెస్టు చేసి తాడేపల్లిగూడెం కోర్టులో హాజరు పర్చినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును గణపవరం సీఐ డేగల భగవాన్‌ ప్రసాద్‌, గణపవరం ఎస్‌ఐ వీరబాబు దర్యాప్తు జరిపి ఛేదించారు.


Advertisement
Advertisement
Advertisement