Abn logo
Sep 18 2021 @ 23:33PM

విద్యార్థి అదృశ్యంపై కేసు

గండేపల్లి, సెప్టెంబరు 18: మండలంలోని సూరంపాలెం ప్రైవేట్‌ విద్యాసంస్థలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సామర్లకోటకు చెందిన మాధు రి(19) అదృశ్యంపై కేసు నమోదు చేసిన ట్టు గండేపల్లి పోలీసులు తెలిపారు. ఈనెల 17న కళాశాలకు వెళ్లి ఇంటికి రాలేదని.. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు ఇచ్చినా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.