గంధం చెక్కల మాయం వ్యవహారంలో నలుగురిపై వేటు

ABN , First Publish Date - 2022-01-19T06:29:19+05:30 IST

పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచిన శ్రీగంధం చెక్కల మాయం వ్యవహారంలో నలుగురు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

గంధం చెక్కల మాయం వ్యవహారంలో నలుగురిపై వేటు

రెండోరోజూ కొనసాగిన విచారణ 

పెనుకొండ, జనవరి 18: పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచిన శ్రీగంధం చెక్కల మాయం వ్యవహారంలో నలుగురు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. పెనుకొండ ఫారెస్ట్‌ రేంజ్‌  బీట్‌ ఆఫీసర్‌ చిన్నప్ప, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్లు భాస్కర్‌, రామకృష్ణ, సు ధాకర్‌ సస్పెండ్‌ అయ్యారు. కార్యాలయంలో వారు విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. శ్రీగంధం చెక్కలు, 16 లీటర్ల శ్రీగంధం నూనె డబ్బా చోరీ అవడంపై చీఫ్‌ కన్జర్వేషన ఆఫ్‌ ఫారెస్ట్‌ శ్రీనివాసశాస్ర్తి, జిల్లా అటవీశాఖ అధికారి సంపత కృపాకర్‌ రెండోరోజైన మంగళవారమూ విచారణ చేపట్టారు. ఈ చో రీలో ఇంటి దొంగల పాత్ర కూడా ఉన్నట్లు తెలిస్తే వారిని సస్పెండ్‌ చేయడంతోపాటు విధుల నుంచి శాశ్వతంగా తొలగించి, జైలుకు పంపుతామన్నారు. చోరీ అయిన గంధం చెక్కల కోసం అటవీశాఖ, స్థానిక పోలీసులు బృందాలుగా ఏర్పడి కేరళ, తమిళనాడు, కర్ణాటకలో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గంధం చెక్కలు భద్రపరిచిన గది కిటికీలను తొలగించడంతో దానిని అధికారులు మూసివేయించారు.


Updated Date - 2022-01-19T06:29:19+05:30 IST