గాంధీలో కరోనా టీకా సిద్ధం

ABN , First Publish Date - 2021-01-14T06:56:48+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో సిబ్బందికి తొలివిడత కరోనా వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్‌ ప్రొఫసర్‌ రాజారావు తెలిపారు.

గాంధీలో కరోనా టీకా సిద్ధం

16న వైద్యులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌
అడ్డగుట్ట, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):
గాంధీ ఆస్పత్రిలో సిబ్బందికి తొలివిడత కరోనా వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్‌ ప్రొఫసర్‌ రాజారావు తెలిపారు. మొదటి విడతలో ఏడు వాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో కౌంటర్‌లో వంద మంది చొప్పున రోజుకు 700 టీకాలు వేస్తామని తెలిపారు.
కొవిడ్‌ చికిత్సలో గాంధీ కృషిపై ప్రధాన మంత్రి మోదీ గతంలో సూపరింటెండెంట్‌ను ఫోన్‌లో అభినందించిన విషయం తెలిసిందే. ఈనెల 16న ప్రధాని మోదీ ఆస్పత్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నట్లు సమాచారం వచ్చిందని సూపరింటెండెంట్‌ ప్రొఫసర్‌ రాజారావు తెలిపారు. 

Updated Date - 2021-01-14T06:56:48+05:30 IST