‘ఇదే కొనసాగితే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముంది’

ABN , First Publish Date - 2021-07-29T18:14:06+05:30 IST

గాంధీలో ఆస్పత్రిలో రెండు వారాలుగా కరోనా సివియార్టీ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

‘ఇదే కొనసాగితే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముంది’

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో రెండు వారాలుగా కరోనా సివియార్టీ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. గురువారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉందని... ఇదే కొనసాగితే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని అన్నారు. పండుగలు, సభలు, సమావేశాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం గాంధీలో 400 మంది వరకు చికిత్స పొందుతున్నారని చెప్పారు.  గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించడం కొంత రిస్క్ వ్యవహారమే అని చెప్పుకొచ్చారు. ఆగస్టు 3 నుంచి నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని రాజారావు వెల్లడించారు. 

Updated Date - 2021-07-29T18:14:06+05:30 IST