Advertisement
Advertisement
Abn logo
Advertisement

గాంధీ మండపం ధ్వంసం

నేలకొరిగిన విగ్రహాలు.. 

లారీ ఢీకొన్నట్టు సీసీ కెమెరాలో రికార్డు 

పెంటపాడు, డిసెంబరు 1:  పెంటపాడు గాంధీ సెంటర్‌లోని గాంధీ,  నెహ్రూ,   ఇందిరా గాంధీ విగ్రహాలు ఉన్న మండపం మంగళవారం రాత్రి లారీ ఢీకొనడంతో కూలిపోయింది. దీంతో మూడు విగ్రహాలు కింద పడిపోయాయి. తాడేపల్లిగూడెం నుంచి పిప్పర వైపు వెళ్తున్న లారీ  రివర్స్‌ చేస్తున్న సమయంలో గాంధీ మండపాన్ని ఢీ కొట్టడంతో మండపం పూర్తిగా విరిగిపోయింది. ఈ వివరాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.   సంఘటనా స్థలానికి చేరుకున్న పెంటపాడు ఎస్‌ఐ చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ శేషగిరిరావు , సర్పంచ్‌ సూర్యకళ  సమక్షంలో విగ్రహాలను  పంచాయతీ కార్యాలయానికి తరలించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుడు మార్నీడి బాబ్జి, నర్సాపురం పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, సీపీఎం మండల కన్వీనర్‌ చిర్ల పుల్లారెడ్డి తదితరులు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పెంటపాడు ఎస్‌ఐ చంద్రశేఖర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కాగా జాతిపిత క్విట్‌ ఇండియా సమయంలో పెంటపాడులో పర్యటనకు గుర్తుగా 1947లో గ్రామ ప్రధాన కూడలిలో  ఏర్పాటుచేసిన మహాత్ముని విగ్రహం ధ్వంసమవడంపై  గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement