Advertisement
Advertisement
Abn logo
Advertisement

గాంధీ వేషధారణలో రూ. 2.62 లక్షల చెక్కుతో కలెక్టరేట్‌కు వచ్చి...

నమక్కల్: తమిళనాడులోని నమక్కల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఒక వ్యక్తి గాంధీ వేషధారణలో రూ. 2.63 లక్షల చెక్కు తీసుకుని రావడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే తమిళనాడు ఆర్థికశాఖ మంత్రి పీ త్యాగరాజన్  ఇటీవల... రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రజారుణం పెరిగిందని, అది రూ. 2.63 లక్షలకు చేరుకుందని తెలిపారు. 

ఈ మాట ఒక వ్యక్తిని కదిలించివేసింది. దీంతో అతను తన ప్రజారుణాన్ని తీర్చివేసేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. తాను చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తానని అథికారులకు తెలిపాడు. అయితే వారు ఆ మెత్తాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. మహాత్మా గాంధీ మార్గంలో నడిచే గాంధీ రమేష్ కలెక్టర్ కార్యాలయంలోని అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి రుణం తీర్చే భారాన్ని తగ్గించేందుకు తాను రూ. 2,63,976 దానం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement