Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాలువ కట్టలు, రహదారుల గండ్లు పూడ్చాలి : సీపీఎం

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు6: మండలంలో వరదల ధాటికి కోతకు గురైన పొలాలకు వెళ్లే మార్గాలు, కాలువ కరకట్టలు, పొర్లుకట్టలు, రహదారులకు పడిన గండ్లు  పూడ్చాలని జిల్లా రైతు సంఘం నాయకులు గండవరపు శ్రీనివాసులు, పలువురు సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం జలవనరులశాఖ డీఈ కార్యాలయంలో అధికారులకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కాలువల్లో పూడికలు తొలగించి రైతాంగానికి సహాయపడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పొట్టేపాళెం సుధాకరయ్య, చలంచర్ల రత్తయ్య, బీకేఎస్‌ నాయకులు హరిసర్వోత్తమరెడ్డి,  పొట్టేపాళెం ప్రభాకర్‌, రైతులు చలమయ్య,  చంద్రశేఖర్‌రెడ్డి, రాగిగోపాల్‌, గోళ్ల వేణు, ఎస్‌కే.బాబు,  చంత ప్రసాద్‌,  నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement