Abn logo
Sep 20 2021 @ 01:25AM

ఉట్నూర్‌లో ముగిసిన గణేష్‌ నిమజ్జనం

ఉట్నూర్‌లో గణేష్‌ శోభాయాత్రలో నృత్యాలు చేస్తున్న యువకులు

ఉట్నూర్‌, సెప్టెంబరు 19:  ఉట్నూర్‌ పట్టణంలో ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాలకు ఆదివారం రాత్రి ఘనంగా గణేష్‌ నిమజ్జనం నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు ఆదివారం గణపయ్యా.. వెళ్లి రావయ్యా.. అంటూ శోభాయాత్రలో పాల్గొన్నారు. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అదికారులు  బందోబస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలోని వివిధ వీధులలో ప్రతిష్ఠించిన గణేష్‌ విగ్రహాలను మండపాల నిర్వాహకులు వాహనాలపై ప్రత్యేకంగా గణేష్‌లను అలంకరించి తమ రథాలను ముందుగా పట్టణంలోని వినాయక్‌చౌక్‌కు తీసుక వచ్చారు. వర్షంలో సైతం భక్తులు పాల్గొని గణేష్‌ నిమజ్జనం నిర్వహించారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పతాకావిష్కరణ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఎఎస్పీ హర్షవర్ధన్‌, ఆర్డీవో రాజేశ్వర్‌ జాడి, తహసీల్దార్‌ సతీష్‌, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, జడ్పీటీసీ చారులతలతో పాటు బొడ్డు కిరణ్‌, సాడిగే రాజ్‌గోపాల్‌, గోపాల్‌సింగ్‌, కోండేరి రమేష్‌, కొలిపాక రాజశేఖర్‌, తదితరులు ఉన్నారు.