Abn logo
Sep 21 2021 @ 23:17PM

ఆసిఫాబాద్‌లో ఘనంగా గణేష్‌ నిమజ్జన్సోతవం

ఆసిఫాబాద్‌లో గణనాథుడి శోభాయాత్ర

 కన్నుల పండువగా శోభాయాత్ర

 నృత్యాలు, కోలాటాలతో సందడి

 పోలీసుల భారీ బందో బస్తు

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 21: ఆసిఫాబాద్‌ జిల్లాకేంద్రంలో గణేష్‌ నిమజ్జనోత్సవం ఆనందోత్సాహాలతో ప్రశాంతంగా జరిగింది.  మహిళల మంగళ హార తులు, యువత కేరింతలు, నృత్యాలు, కోలా టాల మధ్య గణేషుడి శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. నిమజ్జనానికి ముందు లడ్డూల వేలంపాట ఎంతో ఆసక్తికరంగా సాగింది. జన్కాపూర్‌లోని శ్రీకోదండ రామా లయం వద్ద ద్విచక్రవాహనం, స్వామివారి లడ్డూలను జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవలక్ష్మి లక్కీడిప్‌ తీశారు. స్కూటీ జాడీ కార్తీక్‌, లడ్డు బొల్లు త్రినైనీ దక్కించుకున్నారు. బజారువాడలోని సంఘసేవా గణేష్‌ మండపం వద్ద డీఎస్పీ శ్రీనివాస్‌ లక్కి డీప్‌ తీయగా లడ్డును బొట్టుపల్లి విలాస్‌, బైక్‌ను నెన్నెల మహేష్‌ దక్కించుకు న్నారు. డప్పువాయిద్యాలు, కోలాటాలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.  

యువత కేరింతలు తొక్కుతూ డ్యాన్సులతో ఊరేగింపులో పాల్గొన్నారు. అయా కార్యక్రమాల్లో డీసీసీ ఆధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, ఎంపీపీ అరిగెల మల్లిఖార్జున్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆత్రం వినోద్‌, కోవ సాయినాథ్‌, శైలేందర్‌, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకో కుండా డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐలు అకుల ఆశోక్‌, సాదుల సతీష్‌, ఎస్సైలు గంగన్న, వెంకటేష్‌, రాజేశ్వర్‌, పీవీఎస్‌ భవానీసేన్‌, పీఎస్సైలు సందీప్‌, రామకృష్ణ, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని పెద్దవాగులో గణనాథు లను నిమజ్జనం చేశారు.