Abn logo
Aug 11 2020 @ 00:20AM

బాలీవుడ్‌కి ‘వినాయకుడు’

లావుగా ఉన్నవాళ్ళకు ప్రేమించే అర్హత లేదా? ప్రేమించకూడదా? ఒకవేళ ప్రేమిస్తే... ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ‘వినాయకుడు’ చిత్రంలో దర్శకుడు సాయికిరణ్‌ అడివి చూపించారు. ప్రేమ, వినోదం, భావోద్వేగాలు మేళవించిన కథను వెండితెరపై హృద్యంగా, సున్నితంగా ఆవిష్కరించారు. సుమారు పన్నెండేళ్ళ క్రితం విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత తమిళంలో విడుదల చేయగా, అక్కడా విజయం సాధించింది. ఇప్పుడీ కథను సాయికిరణ్‌ అడివి బాలీవుడ్‌ తీసుకువెళుతున్నట్టు తెలిసింది. హిందీలో ‘వినాయకుడు’ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి రంగం సిద్ధమైందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలుగులో కృష్ణుడు పోషించిన పాత్రను హిందీలో లావుగా ఉన్న ఓ ప్రముఖ హాస్యనటుడు పోషించనున్నాడనీ, కథానాయకుడిగా అతనికి ఇదే తొలి చిత్రమని సమాచారం. ఇప్పటికే సినిమా చూసిన అతను, దర్శకుడికి తన అంగీకారాన్ని తెలిపారట. మిగతా నటీనటులు ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తారట. ఈ చిత్రంతో సాయికిరణ్‌ అడివి బాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయం కానున్నారు.

Advertisement
Advertisement
Advertisement